వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అని హర్యానా, కశ్మీర్ ఎన్నికల ఫలితాల తర్వాత కేటీఆర్ మరోసారి చెప్పారు. అయితే బీఆర్ఎస్కు ఆశల్లేవా అని సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. దీనికి కారణం టీఆర్ఎస్ అనే ప్రాంతీయపార్టీని బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీగా మార్చుకోవడమే
లోక్సభ ఎన్నికల్లో కేటీఆర్ ప్రచార అస్త్రం ప్రాంతీయ నినాదమే. కేటీఆర్ తాము జాతీయ పార్టీగా మారామన్న భావన ప్రజలకు రానివ్వకుండా .. ఇది మీ పార్టీ మీరు కాపాడుకోవాలని తెలంగాణ ప్రజలను నమ్మించేందుకు ప్రయ్తనించారు. కానీ అనకున్న ఫలితాలు రాలేదు. అయితే ఆ కాన్సెప్ట్ ను ఇవాళ కాకపోతే రేపైనా ప్రజలు ఆదరిస్తారని కేటీఆర్ నమ్మకంతో ఉన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో అయినా ప్రాంతీయ పార్టీలదే హవా అని చెబుతున్నారు.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్గా మార్చేసిన అంశం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం తెలంగాణ పార్టీని వదిలేశారని కూడా నమ్మారు. ఈ భావన పోయేలా చేయడానికి బీఆర్ఎస్ పార్టీని మరోసారి టీఆర్ఎస్ గా మార్చాల్సి ఉంది. కానీ ఆ ప్రయత్నం చేయడంలేదు. పేరు మార్పు చేయగలిగితే అంత కన్నా రిలీఫ్ ఉండదని క్యాడర్ అనుకుటున్నారు అనుకుంటున్నారు. కానీ వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు మారుతాయని కేటీఆర్ అనుకుంటున్నారేమో కానీ.. ఆప్రయత్నాలు చేయడం లేదు.
తెలంగాణ సెంటిమెంట్ ఉద్ధృతంగా ఉన్నప్పుడు తెలంగాణ అంటే టీఆర్ఎస్ .. మిగతా పార్టీలన్నీ బయట పార్టీలే అని అనుకునేలా చేశారు. మళ్లీ అలాంటి భావన కల్పించగలిగితే మళ్లీ బీఆర్ఎస్కు పూర్వ వైభవం వస్తుంది. అలా చేయడానికి తమది ప్రాంతీయ పార్టీ అనే భవన కల్పించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు.