రేవంత్ సర్కార్ ను బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ బూమరాంగ్ అవుతున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా.. అవన్నీ హస్తం పార్టీకే అడ్వాంటేజ్ గా మారుతూ వచ్చాయి. తాజాగా రైతు రుణమాఫీ విషయంలోనూ అదే జరిగింది.
రైతు రుణమాఫీకి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని గైడ్ లైన్స్ లో పొందుపరిచింది రేవంత్ సర్కార్. ఈ అంశంపై ముందు, వెనకా మరేం ఆలోచించకుండా బీఆర్ఎస్ తన నోటికి పని చెప్పింది. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మోసం మరోసారి బయటపడిందని విమర్శలు స్టార్ట్ చేసింది. అర్హులైన రైతుల సంఖ్యను కుదించెందుకే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారని ఆరోపించింది.
రుణమాఫీ ద్వారా రైతులంతా కాంగ్రెస్ వైపు టర్న్ అయితే ఇబ్బంది అవుతుందని..హారీష్ , కేటీఆర్ , నిరంజన్ రెడ్డితో సహా పలువురు నేతలు కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. అయితే, పాస్ బుక్ ల ఆధారంగానే రెండు లక్షల రుణమాఫీ వర్తింపు జరుగుతుందని… కేవలం కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డును ప్రమాణికంగా తీసుకుంటామని సర్కార్ క్లారిటీ ఇవ్వడంతో బీఆర్ఎస్ రాజకీయం బెడిసికొట్టినట్లు అయింది.
రైతులకు సంబంధించిన పలు విషయాల్లో కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తోన్న బీఆర్ఎస్ కు ఏదీ కలిసి రావడం లేదు. రైతు బంధు విషయంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ను ఇరుకునపెట్టేందుకు ప్రయత్నించినా అది బెడిసికొట్టింది. తాజాగా రైతు రుణమాఫీ విషయంలోనూ అదే జరిగింది.