ఏపీ ప్రభుత్వం ఇంకా పేపర్ల మీదనే పెట్టుకునే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ రాజకీయాలు ప్రారంభించింది. ఆ ప్రాజెక్టు నిర్మించి గోదావరి నీటిని తోడేసుకుంటున్నారని కానీ రేవంత్ ప్రభుత్వం నోరెత్తడం లేదని హరీష్ రావు ప్రెస్మీట్ పెట్టేశారు. ఇటీవల రేవంత్ బకనచర్లపై అభ్యంతరాలను ఏపీకి చెప్పాలని అధికారులను ఆదేశించారు. బకనచర్లకు ఆర్థిక సాయం చేయవద్దని ఉత్తమ్ కేంద్రానికి లేఖ రాశారు.
అవసరం లేని స్పందనతో బనకచర్లకు రేవంత్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూండటం..దాని వల్ల తెలంగాణకు ఏదో నష్టం జరిగిపోతుందన్న ప్రచారాన్ని ఉద్ధృతం చేయడానికి బీఆర్ఎస్ సిద్దమయింది. దిగువ రాష్ట్రం ప్రాజెక్టులు కట్టుకుంటే ఎగువ రాష్ట్రం అభ్యంతరం చేయడానికి ఏముంటుంది ?. కృష్ణా, గోదావరి నదుల్లో అత్యంత దిగువ రాష్ట్రం ఏపీ. ఆ రాష్ట్రం ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుని పై నుంచి రావాల్సిందే. అలా కృష్ణలో వస్తున్న నీరుకానీ.. గోదావరి వస్తున్న నీరు కానీ.. నిల్వ చేసుకున్నంత చేసుకుని మిగతాది సముద్రంలోకి వదిలేస్తున్నారు.
గోదావరి నుంచి వేల టీఎంసీలు ప్రతి ఏటా సముద్రంలోకి పోతున్నాయి. కొన్ని వందల టీఎంసీలు మళ్లించుకుని రాయలసీమకు ఇవ్వాలని చంద్రబాబు ప్రయత్నం. చంద్రబాబు ప్రాజెక్టుల్లో స్టోర్ చేసుకున్న నీటిని మోటార్లతో తోడేసుకుని రాయలసీమకు పంపుతానమని చెప్పడం లేదు. అయినా తెలంగాణకు ఏదో నష్టం జరుగుతోందన్న ప్రచారంతో.. కాంగ్రెస్ ను ఇబ్బందిపెట్టడానికి .. రేవంత్ ను దాటేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం బనకచర్లకు ఎంత ప్రాధాన్యం ఇస్తే.. బీఆర్ఎస్ దాన్ని అంత పెద్దది చేస్తుంది.