గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఒక్క సారిగా ప్లేట్ ఫిరాయించడంతో ఏర్పడిన గందరగోళంతో ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలూ టెన్షన్ పడుతున్నారు. కొంత మంది ఇతర ఎమ్మెల్యేలపైనా బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యూహాత్మక రివర్స్ ఫిరాయింపు ప్రచారం ప్రారంభించింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును టీ తాగేందుకు పిలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓ ఫోటో తీసి బయటకు పంపించారు. దాంతో ఆయన కూడా రివర్స్ జంపింగ్ అనే ప్రచారం ఊపందుకుంది. ఈ జాబితాలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను కూడా చేర్చారు.
దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చుకున్నారు. తాము కాంగ్రెస్ పార్టీని వదలడం లేదని.. ఆ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. తమపై తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. ఏదో ఫ్రెండ్లీగా టీ తాగేందుకు పిలిస్తే వెళ్లానని.. అంత మాత్రాన తాను కాంగ్రెస్ పార్టీని వీడిపోతున్నట్లుగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. ఓ పార్టీలో ఉన్న నేతపై అదే పార్టీలో ఉన్న పెద్దలకు అనుమానం కలిగేలా చేయడం కూడా రాజకీయ వ్యూహంలో భాగంగా అందులో భాగంగానే… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ మైండ్ గేమ్ ప్రారంభించింది.
Also Read : కాంగ్రెస్ కు షాక్.. బీఆర్ఎస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే !
అసలు అందర్నీ నచ్చ చెప్పించి మరీ పార్టీలో చేర్చుకున్న గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు మళ్లీ రివర్స్ అయ్యారన్న దానిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. తన ఎన్నిక చెల్లదని హైకోర్టులో పడిన పిటిషన్లపై విచారణలో లాయర్ ను గతంలో బీఆర్ఆర్ ఏర్పాటు చేసింది. పార్టీ మారడంతో లాయర్ ను తీసేశారు. ఇప్పుుడు లాయర్ ను కొనసాగించాలని కేటీఆర్ ను కోరానని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అంటున్నారు. అంత మాత్రానే ఆయన రివర్స్ అయ్యే అవకాశం లేదని.. ఆయన ఏదో తీర్చలేని కోరిక కేరి ఉంటారని.. పట్టించుకోకపోవడంతో.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కొంత మంది బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.