మీరు రెచ్చిపోండి.. ఏమైనా మేం చూసుకుంటాం..మీకే భయం లేదు.. మన లీగల్ సెల్ మీకు అండగా ఉంటుంది.. ఇవీ ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పెద్ద లీడర్లు చెబుతున్నమాటలు. వాళ్లమో రోడ్డు మీదకు రాకుండా కడుపులో చల్ల కదలకుండా ఏసీ రూముల్లో కూర్చుంటూ.. కార్యకర్తలను ఎగదోస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడేందుకు ఈ మధ్య చాలా అవకాశాలే వచ్చాయి.. కానీ ఒక్క పెద్ద లీడర్ కూడా గ్రౌండ్ లోకి రాలేదు.. పైగా ఫాలోవర్లతో ఫేక్ న్యూస్ లు రన్ చేస్తున్నారు.
యూట్యూబ్ ఛానెల్సే తమను ఓడించాయని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిన కేటీఆర్.. ప్రత్యేకంగా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ను ఏర్పాటు చేయించుకుని, వాటితో నెగెటివ్ క్యాంపెయిన్ చేయిస్తున్నారు. అలాగే, నిరుద్యోగుల ఆందోళనలతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని శతవిధాలా ప్రయత్నించారు. నిరుద్యోగుల వాయిస్ కు కేటీఆర్ , హరీష్ రావు లాంటి నేతలు కోరస్ ఇచ్చినా.. ప్రత్యక్ష ఆందోళనలకు మాత్రం దూరంగా ఉన్నారు. ఈ ఇద్దరి నేతలు ఇచ్చిన ధైర్యంతో ముందూ, వెనక చూసుకోకుండా ఆందోళనలకు దిగడంతో కొంతమందిపై కేసులు కూడా నమోదు అయ్యాయి. ఇప్పుడు వారిని బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆదుకుంటుందా..? అంటే చెప్పలేని పరిస్టితి.
ఇక, ఫేక్ న్యూస్ లను స్ప్రెడ్ చేస్తున్నారని ఈ మధ్య బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియాకు వారెంట్ వచ్చింది. ఓయూ హాస్టల్స్ మూసివేత ఇష్యూ కావొచ్చు, ఓయూలో బీఆర్ఎస్వీ లీడర్ల ఆందోళనలు కావొచ్చు.. ఇవన్నీ కింది స్థాయి నేతలు చేసినవే. ఒక్క పెద్దలీడర్ కూడా గ్రౌండ్ లో కనిపించడం లేదు. ఇటీవల ఓయూలో పోలిసులు చేసిన దాడిలో గాయపడిన విద్యార్ధి సంఘ నాయకులను పరామర్శించారు తప్పితే.. వారితో కలిసి ప్రత్యక్ష ఆందోళనలకు దూరంగా ఉన్నారు. ఇలాగైతే బీఆర్ఎస్ ను కొద్ది కాలం తర్వాత ఫాలోవర్లు సైతం వీడుతారని కేటీఆర్ వాస్తవాలు తెలుసుకోవాలంటున్నారు.