జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరిపోవడం ఖాయమని విస్తృత ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకున్నారు. సంగారెడ్డి బీఆర్ఎస్ నేతలంతా హరీష్ రావును కలిసి … చింత ప్రభాకర్ కు అన్యాయం చేయవద్దని వేడుకున్నారు. ఆయన కూడా … జగ్గారెడ్డిని పార్టీలోకి తీసుకోవడం లేదని చెప్పలేదు . అంతా పార్టీ చూసుకుంటుందని చెప్పి పంపేశారు. దీంతో జగ్గారెడ్డి బీఆర్ఎస్ లో చేరిక ఖాయమనుకున్నారు. కానీ హఠాత్తుగా జగ్గారెడ్డి మాట మార్చేశారు.
తాను బీఆర్ఎస్ లో చేరడం లేదని అలాంటిప్రచారాలు చేసే వారిని ఉపేక్షించేది లేదని డైలాగులు కొట్టారు. తమ పార్టీ వారే కాంగ్రెస్ లో ఉండకూడదని ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. నిప్పు లేకుండా పొగరాదన్నట్లుగా ఎవరు ప్రచారం చేసినా… జగ్గారెడ్డి మాత్రం ప్లాన్ బీలో ఉన్నారని అందరికీ ఓ అభిప్రాయం ఉంది. ప్రచారం ఓ రేంజ్ కు వెళ్లే వరకూ సైలెంట్ గా ఉంటున్న జగ్గారెడ్డి .. చివరిక క్షణంలో తూచ్ అంటున్నారు .
బీఆర్ఎస్ మొదటి జాబితా సోమవారం వచ్చే అవకాశం ఉంది. ఆ జాబితాలో చోటు ఉంటుందని అనుకున్నారు. కానీ ఉండదని క్లారిటీ రావడంతోనే జగ్గారెడ్డి రివర్స్ అయ్యారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ను బలహీనపర్చడానికి కాంగ్రెస్ నేతల్ని తీసుకుంటే… బీఆర్ఎస్ కు నష్టం జరుగుతుందని.. అందుకే కేసీఆర్ వెనుకడుగు వేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.