పార్లమెంట్ ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ ఎంత క్లూ లెస్ గా ఉందో.. బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా అలాగే దారి తప్పిపోయింది. మార్ఫింగ్ ఫోటోలతో టీడీపీ నేతల్ని టార్గెట్ చేసి వారితో లొల్లి పెట్టుకుంటున్నారు కానీ.. తెలంగాణ ప్రభుత్వంపై మాత్రం పోరాటం చేయలేకపోతున్నారు. టీడీపీ సోషల్ మీడియా సానుభూతిపరులతో వాదులాట పెట్టుకుని.. టైం పాస్ చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడటానికి…తప్పుల్ని ఎత్తి చూపడానికి కూడా భయపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఫేక్ న్యూస్ పోస్ట్ చేస్తే… సహించే పరిస్థితి లేకపోవడంతో ఎక్కువ మంది భయపడుతున్నారు. దీంతో వారు.. ఖాళీగా ఉండలేక అవసరం లేని వాదనలకు సోషల్ మీడియాలో దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఇలా టీడీపీ విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా అతి స్పందించడంతో .. వారంతా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేశారు. అలా పని చేయడం వల్ల కాంగ్రెస్ కు వచ్చే లాభమేమీ ఉండకపోవచ్చు కానీ.. బీఆర్ఎస్ మ్యాన్ పవర్ మాత్రం పనికి రాని విషయంలపై డైవర్ట్ అయిపోయింది.
ఇప్పుడుకూడా అదే చేస్తున్నారు. ముందు మీరు ప్రారంభించారంటే.. మీరు ప్రారంభించారనుకుని.. ఒకరిపై ఒకరు మార్ఫింగ్ లు వేసుకుని టైం పాస్ చేసుకుంటున్నారు. మరో వైపు కాంగ్రెస్ సోషల్ మీడియా.. బ లహీనంగా ఉన్నప్పటికీ..ఉన్న కొద్ది అకౌంట్ల ద్వారానే బలంగా ముద్ర వేస్తోంది. ఆపన్న హస్తం లాంటి అకౌంట్ల కంటెంట్ డామినేట్ చేస్తోంది.