బీఆర్ఎస్ మళ్లీ తెలంగాణలో ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయాలని పార్టీ క్యాడర్ ను ఆదేశించింది, ఎందుకంటే.. ఉపాధి హామీ నిధులను దుర్వినియోగం చేశారని.. వాటిని తక్షణం వెనక్కి ఇవ్వాలని కేంద్రం అడగడమే. ఉపాధి హామీ నిధులతో తెలంగాణ ప్రభుత్వం.. రైతుల పొలాల్లో కళ్లాలు నిర్మించామని చెబుతోంది నిర్మించిందో లేదో స్పష్టత లేదు. కానీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం… వ్యవసాయ కళ్లాల నిర్మాణం.. ఉపాధి హమీ పనులతో చేపట్టే అవకాశం లేదు. అయినప్పటికీ తెలంగాణ వాటిని నిర్మించామని .. ఖర్చు చేశామని చెబుతోంది.
కేంద్రం మాత్రం ఆ నిధులను వెనక్కి ఇవ్వాలని అంటోంది. దీంతో తెలంగాణ .. తెలంగాణ రైతులపై కుట్ర చేస్తోందని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరసనలు, ధర్నాలకు పిలుపునిచ్చారు. రైతులు కళ్లాలు నిర్మించుకుంటే తప్పా అనే వాదనను తెరపైకి తెచ్చారు. రైతులు కళ్లాలు నిర్మించుకుంటే తప్పు లేదు కానీ.. అవి ఉపాధి హామీ నిధులతో నిర్మించుకోవడమే తప్పని.. .ఆ నిధులను వెనక్కివ్వాలని కేంద్రం అంటోంది. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుబంధానం చేయాలని తమ డిమాండ్ చాలా కాలం నుంచి ఉందని టీఆర్ఎస్ అంటోంది.
కారణం ఏదైనా.. బీజేపీపై పోరాటంలో బీఆర్ఎస్ ఇలా నిబంధనలకు విరుద్ధంగా తామే వ్యవహరించి.. కేంద్రం తమపై కుట్ర చేస్తోందని..తామే రోడ్డెక్కడం కాస్త విచిత్రంగా ఉంటుంది.ఈ అంశంపై టీఆర్ఎస్ కార్యకర్తలు గుడ్డిగా బీజేపీపై విమర్శలు చేయవచ్చు కానీ..కాస్త పరిజ్ఞానం ఉన్న వారికి మాత్రం..తప్పు తెలంగాణ ప్రభుత్వానిదేనని అర్థమైపోతుంది. కేంద్రం నిజంగా అన్యాయం చేస్తున్న అంశాలపై ధర్నా చేస్తే ప్రజల మద్దతు లభిస్తుంది కానీ.. ఇలా నిబంధనలు ఉల్లంఘించి అంశంపై కేంద్రంపై నిందలేస్తే.. ఏం ఎఫెక్ట్ రాదని భావిస్తున్నారు