భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయి రాజకీయ వ్యూహలోపంతో బాధపడుతోంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది. ఎందుకు వ్యతిరేకించాలో కారణం చెప్పడం లేదు. విచిత్రమైన వాదనలతో తెరపైకి వస్తున్నారు. పాకిస్థాన్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తారని.. మరొకటని చెబుతున్నారు. ఇలాంటి ఆరోపణల వల్ల బీఆర్ఎస్ కు ఏం మేలు జరుగుతుందో కానీ ఇప్పుడు మూసి ఆక్రమణలను తొలగించడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు.
మూసిలో ఇళ్లు కట్టుకున్నది నిరుపేదలే. అందులో సందేహం లేదు. వారికి పదిహేను వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందరికీ పునావాసం కల్పించిన తర్వాతనే కూలగొట్టేలా ప్లాన్ చేసుకున్నారు. మూసి నది ఒకప్పుడు ఎలా ఉండేదో కానీ.. ఇప్పుడు మాత్రం… మురికి కాలువలా మారిపోయింది . కబ్జాలే కారణం. డ్రైనేజీని వదలడమే కారణం. కానీ ఇప్పుడు దాన్ని బాగు చేయాలని రేవంత్ సంకల్పించారు. ఇది ప్రజల్ని మెప్పించే నిర్ణయం.
ఈ నిర్ణయాన్ని సరైన కారణాలతో వ్యతిరేకించాలి. కానీ విపక్షం కాబట్టి వ్యతిరేకించాలనుకోవడం ఎదరు దెబ్బలకు కారణం అవుతోంది. సోషల్ మీడియాలో ఎంత ప్రచారం చేసినా… బీఆర్ఎస్ క్యాడర్ తో తిట్టించినా రివర్స్ అవుతాయి. మూసి ప్రాజెక్టు సుందీకరణ ను వ్యతిరేకించడానికి కేటీఆర్ ఇంకా బలమైన కారణాలను వెదుక్కోవాల్సి ఉంది.