రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ట్విట్టర్లో జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదు.. అంటే అర్థం కాలేదా … ఇద్దరి మధ్య సంబంధాలు బాగోలేదని అని బీఆర్ఎస్ నేతలు ఆనందిస్తున్నారు. వారు నిజంగానే ఆనందిస్తున్నారో లేదో కానీ అలా ప్రచారం మాత్రం జోరుగా చేసేస్తున్నారు. అసలు హైకమాండ్ నుంచి ఎవరూ ఆయనకు శుభాకాంక్షలు చెప్పలేదని అంటున్నారు. తమ పార్టీ ముఖ్యమంత్రికి రాహుల్ నేరుగా ఫోన్ చేసి విష్ చేశారని.. ఏదో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పడేయకుండా ఆప్యాయంగా ఫోన్ చేశారని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. కానీ కవర్ చేసుకుంటున్నారని బీఆర్ఎస్ వాదిస్తోంది.
కాంగ్రెస్ హైకమాండ్‌తో లొల్లి పెట్టుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేదు. తమ పార్టీకి అనితర సాధ్యమైన విజయాన్ని అందించి.. యంగ్ స్టర్‌గా దక్షిణాదిలో రాబోయే కాలంలో పిల్లర్ గా మారతాయని భావిస్తున్న రేవంత్ రెడ్డిని దూరం చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ హైకమాండ్‌కు లేదు. అయినా బీఆర్ఎస్ది అదో ఆశ. రేవంత్ రెడ్డిని హైకమాండ్ కు దూరం చేస్తే.. ఆయనపై నమ్మకం తగ్గిస్తే చాలని అలా చేయలేకపోతే కనీసం దూరం అయ్యారని ప్రచారం చేసినా చాలని సంతృప్తి పడిపోతున్నారు.
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వకుండా ఎన్ని చేశారో చెప్పాల్సిన పని లేదు. గాంధీభవన్‌లో గాడ్సే అని కేటీఆర్ ఎన్నో సార్లు చెప్పారు. రేవంత్ కాంగ్రెస్‌లో లేకపోతే ఆ పార్టీ ఎక్కడికో వెళ్లిపోతుందని కేటీఆర్ కూడా జోస్యాలు చెప్పారు . కానీ ఈ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు బాగా తెలుసు. అందుకే రేవంత్ రెడ్డిని అలా ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఎలా చూసినా ఒక వేళ ఏమైనా తేడాలు వచ్చే పరిస్థితి వచ్చినా రేవంత్ కవర్ చేసుకుంటారు కానీ.. దాన్ని పెంచుకోరు. కానీ బీఆర్ఎస్కు మాత్రం ఎప్పటికప్పుడు టెన్షన్ తప్పడం లేదు.