అవసరం లేకపోయినా ఫిరాయింపు ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకుంటే మొత్తానికే మోసం వస్తుందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితులు అన్నీ ఉప్పు – నిప్పులా న్నాయి. బీఆర్ఎస్ నుంచి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేయడం సంచలనం అయింది. వీరిద్దరి సమస్య ఫిరాయింపులే. అంటే ఫిరాయింపుల ద్వారా బీఆర్ఎస్లోకి వచ్చిన వారి కారణంగా వీరికి టిక్కెట్లు దక్కలేదు. దక్కే చాన్స్ కూడా లేకుండా పోయింది. అందుకే వీరు బీఆర్ఎస్ తమను సస్పెండ్ చేసేదాకా తెచ్చుకున్నారు.
అయితే వీరిద్దరే కాదని ఇంకా చాలా మంది ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించినా కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేల్ని ఫిరాయించేలా చేసుకున్నారు. ఆ పన్నెండు చోట్ల టీఆర్ఎస్ తరపున పని చేసిన నేతలు పక్క చూపులు చూస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో వర్గ పోరాటం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ గుర్తుపై గెలిచి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేసీఆర్ మొదటే టిక్కెట్ హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ ఓడిపోయిన ప్రతీ చోటా బలమైన అభ్యర్థులు ఉన్నరు. పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సహా ఫిరాయించిన ఎమ్మెల్యే ఉన్న ప్రతీ చోటా బలమైన బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. వారంతా ఇప్పుడు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కాకపోతే బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి . ఇప్పటికిప్పుడు ఇద్దర్ని సస్పెండ్ చేసినా వారు పార్టీకి వ్యతిరేకంగా మారింది.. తమను కాదని ఫిరాయింపు దార్లను ప్రోత్సహించినప్పుడే. ఇతర చోట్లా కూడా ఉన్న ఈ అసంతృప్తి బయటపడితే ప్రమాదమని.. హైకమాండ్ వెంటనే ఇలాంటి అసంతృప్తుల్ని సర్దుబాటు చేయకపోతే అంటుకుంటుందని బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.