తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. టీచర్ ఎమ్మెల్సీలను పక్కన పెడితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై అందరి దృష్టి ఉంది. బీజేపీ తన అభ్యర్థిగా అంజిరెడ్డి అనే పటాన్ చెరు నేతను ప్రకటించింది. ఆయన ఓటర్ల నమోదుతో పాటు ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. షెడ్యూల్ రాగానే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా విద్యావేత్త నరేందర్ రెడ్డిని ప్రకటించింది. ఇక పెండింగ్ బీఆర్ఎస్ పార్టీనే.
నాలుగు ఉత్తర తెలంగాణ లోని జిల్లాల పట్టభద్ర ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. రేవంత్ పాలనపై ఈ ఎన్నిక ఖచ్చితంగా ప్రజాభిప్రాయసేకరణ లాంటిదని ప్రచారం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీపై బీఆర్ఎస్ చేస్తున్నదంతా ఉత్తుత్తి ప్రచారమేనని సోషల్ మీడియా హైపేనని క్లారిటీ వస్తుంది. అదే సమయంలో బీఆర్ఎస్ గెలిస్తే.. ఆపార్టీ నేతలు చెప్పుకుంటున్నట్లుగా ప్రజలు తమను మిస్ అవుతున్నారని.. గెలబోయేది తామేనని చెప్పుకోవచ్చు. అయితే అసలు పోటీ చేయకపోతే మొదటికే మోసం వస్తుంది.
బీజేపీ , కాంగ్రెస్ రెండు బరిలోకి నిలిచాయి. బీఆర్ఎస్ తరపున చాన్సిస్తే పోటీ చేయడానికి చాలా మంది ఉన్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఇంకా ఏ విషయం చెప్పలేదు. ఓటర్ల నమోదునూ పట్టించుకోలేదు. అయితే అధికారికంగా కాకపోయినా ఓ అభ్యర్థిని నిలబెట్టి.. మద్దతు ఇస్తామని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇలా అయినా పరోక్షంగా అభ్యర్థిని నిలబెట్టినట్లేనని ఫలితం తేడా వస్తే ఎలా అని హైకమాండ్ ఆలోచిస్తోందని అంటున్నారు.