మూడు ఈశాన్య రాష్ట్రాల్లో పోటీకి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మూడు రాష్ట్రాలు చెందిన కొంత మంది నేతలు.. ఇటీవల హైదరాబాద్ లో కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలతో మాట్లాడివెళ్తున్నారు. తమకు ఆర్థిక సహాకారం అందిస్తే.. తాము బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తామని వారు ప్రతిపాదనలు ఇస్తున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
కొద్ది రోజుల కిందట బీఆర్ఎస్ ప్రముఖుల్ని నాగాలాండ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లోథా కలిశారు. తాను నాగాలాండ్ ఎన్సీపీని బీఆర్ఎస్లో విలీనం చేస్తానని బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఆయన ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవలో పాల్గొన్నారు. ఇతర ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే త్రిపురలో రాజకీయం వేరుగా ఉంటుంది. అక్కడ కూడా కొంత మంది నేతల్ని బీఆర్ఎస్ ప్రతినిధులు సంప్రదిస్తున్నారు. అలాగే 70 శాతానికిపైగా క్రిస్టియన్లు మేఘాలయలో ఆ కోణంలో నేతల్ని సంప్రదిస్తున్నారు.
అక్కడ గెలవడం కాకపోయినా కనీసం ఓట్లు తెచ్చుకుంటే బాగుంటుందన్నఆలోచన చేస్తున్నారు.అక్కడ నియోజకవర్గానికి ముఫ్పై వేల మంది కూడా ఓటర్లు ఉండరు. ఇదే ప్లాస్ పాయంట్ గా ఓట్ల శాతాన్ని పెంచుకోవాలన్న ఆలోచన కేసీఆర్ చేస్తున్నారని అంటున్నారు.జాతీయ పార్టీ గుర్తింపు రావాలంటే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన -1968 ప్రకారం పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. ఈశాన్య రాష్ట్రాల చిన్నవైనా రాష్ట్ర హోదాలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక్కో రాష్ట్రంలో ఆరు శాతం ఓట్లు సాధిస్తే బీఆర్ఎస్కు జాతీయ హోదా వస్తుంది.