టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో కేసీఆర్ బీఆర్ఎస్కు వంద సీట్లు వస్తాయని చెప్పుకొచ్చారు. మొదట 62.. తర్వాత 88 ఇప్పుడు వందసీట్లు ఎందుకు రావన్నారు. వంద సీట్లు వస్తాయని సర్వే రిపోర్టులు ఉన్నాయన్నారు. అయితే ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తారా లేదా అన్న విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అందరి జాతకాలు తన దగ్గరే ఉన్నాయని ఎవరైనా తోక జాడిస్తే కత్తిరిస్తానని హెచ్చరించారు. కొంత మంది ఎమ్మెల్యేలు ఎన్ని సార్లు చెప్పినా మారడం లేదని.. ముఖ్యంగా దళిత బంధువిషయంలో ఎమ్మెల్యేలు వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. అందరి జాతకాలు తన దగ్గర ఉన్నాయన్నారు.
ట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేయాలని, సరిగ్గా పని చేసి మళ్లీ గెలవాలని సూచించారు. పని తీరు బాగా లేని వారి జాబితా తన వద్ద ఉందని, వారు ప్రవర్తన మార్చుకోవాలని చెప్పారు. లేదంటే వారి తోకలు కత్తిరిస్తానని తేల్చి చెప్పారు. అయితే, ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తారని కేసీఆర్ ఈ సభలో స్పష్టం చేశారు. బాగా పనిచేసిన వారికే ఈసారి టికెట్లు దక్కుతాయని తేల్చి చెప్పారు. క్యాడర్ లో అసంతృప్త్తిని తగ్గించే చర్యలు చేపట్టాలని.. మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు. మునుపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనేది ప్రాధాన్యతాంశామన్నారు. దాహమేసినప్పుడు బావి తవ్వుకోవడం కాదని.. ఎన్నికల కోసం ఎప్పుడూ ప్రజల్లో ఉండాలని సలహా ఇచ్చారు.
జాతీయ పార్టీగా మారాం కాబట్టి జాతీయ అంశాలపై తీర్మానాలు చేయాలన్నట్లుగా ఏడు తీర్మానాలు చేశారు. దేశ భవిష్యత్ ను మార్చే అద్భుతమైన ప్రణాళికలు ఉన్నాయని తీర్మానాల్లో పేర్కొన్నారు. దేశ మంతా దళిత బంధు అమలుచేయాలని.. తీర్మానించుకున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ ప్లీనరీ .. సమావేశం .. పార్టీ ఆవిర్భావ సమావేశం..అన్న ఉత్సాహం పెద్దగా కనిపించలేదు. టీఆర్ఎస్ లేకపోవడం.. బీఆర్ఎస్ ఆవిర్భావం ఇటీవలే ఖమ్మంలో చేయడంతో సీరియస్ నెస్ లేకుండా పోయింది నేతలే చర్చించుకున్నారు.