తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి వారం అవుతోంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. గత పదేళ్ల పాలనలో చేసిన అప్పులు.. ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో శ్వేతపత్రాలను సభకు సమర్పించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అలాగే కాళేశ్వరం సహా చాలా పనుల్లో అక్రమాలపై విచారణకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు.
స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన కేటీఆర్… మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శ్వేతపత్రాలపై మాట్లాడారు . కాగ్ రిపోర్టులు.. ఆడిట్ రిపోర్టులు ఉన్నాయని… వాటి కంటే శ్వేతపత్రాలు ఏముంటాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పై బురదచల్లడానికే ప్రయత్నిస్తారన్నారుు. వారంలో రుణమాఫీ అన్నారని ఏమయిందని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టారని వదిలేది లేదని అంటున్నారు. తప్పుడు హామీలు ఇచ్చారని చెబుతున్నారు. అయితే తమ కంటే ఎెక్కువ ఇస్తామని మేనిఫెస్టోలో ఇస్తామన్నారని.. అంటే తప్పుడు హమీలు ఇచ్చారా అని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది.
మరో వైపు కేసీఆర్ లో పనితనమే ఉందని పగతనం లేదని… కక్ష సాధింపులకు పాల్పడి ఉంటే చాలా మంది కాంగ్రెస్ నేతలు జైళ్లలో ఉండేవారని హ రీష్ రావు .. విచారణలు వద్దన్నట్లుగా హెచ్చరికలు జారీ చేశారు. పదేళ్లు అధికారంలలో ఉన్న ప్రభుత్వంలో ఏదో ఓ తప్పును వెదికి పట్టుకోవడం ప్రస్తుత ప్రభుత్వానికి పెద్ద పని కాదు. రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.