చంద్రబాబు కుటుంబంపై బూతులు తిట్టే వాళ్లకి.. టీడీపీ ఆఫీసులు.. టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేసే వారికి వైసీపీ హైకమాండ్ పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తూడటంతో టీడీపీ నేతలు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎవరైనా చంద్రబాబు కుటుంబం పిచ్చి కూతలు కూస్తే తీవ్రపరిమామాలు ఉంటాయని… వందమందితో సూసైడ్ స్క్వాడ్‌ను తయారు చేసుకున్నామని టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన ప్రకటన చేశారు. బుద్దా వెంకన్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైనా నోరు పారేసుకుంటే చంపడానికైనా.. చావడానికైనా సిద్ధమని బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై చెత్త వాగుడు వాగే వారికి ఇదే హెచ్చరిక అని ప్రకటించారు. చంద్రబాబు కుటుంబం జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేశారు. అనవసంగా నోరు పారేసుకుంటే… టీడీపీ నేతల్ని తిడితే … టీడీపీ ఆఫీసుపై దాడులు చేస్తే పదవులు వస్తాయని అనుకుంటున్నారనిని మండిపడ్డారు. చంద్రబాబు, టీడీపీ నేతలపై పిచ్చి వేషాలు వైసీపీ నేతలు మానుకోవాలన్నారు.
సీనియర్లను కాదని జోగి రమేష్‌కు మంత్రి పదవి ఎలా వచ్చిందని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లినందుకే జోగి రమేష్‌కు పదవి వచ్చిందని వైఎస్ఆర్సీపీ నేతలే చెబుతున్నారని బుద్దా వెంకన్న గుర్తు చేశారు. ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పదవుల కోసం టీడీపీ నేతలపై దాడులు, తిట్ల వర్షం కురిపించే వారి సంఖ్య వైఎస్ఆర్సీపీ హైకమాండ్ పదవుల సందేశంతో ఇంకా టీడీపీ నేతలపై దూషణలు పెరుగుతాయన్న ఆలోచనతో బుద్దా వెంకన్న ఈ హెచ్చరికలు చేసినట్లుగా భావిస్తున్నారు.