పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య కన్నమూశారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన కాసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు.
ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో బాధపడుతోన్న బుద్దదేవ్ భట్టాచార్య కోల్ కత్తాలోని ఆయన నివాసంలోనే కన్నుమూసినట్లు సీపీఎం స్టేట్ సెక్రటరీ మహ్మద్ సలీం వెల్లడించారు.
వెస్ట్ బెంగాల్ లో మూడు దశాబ్దాలపాటు సీపీఎం అధికారంలో కొనసాగగా.. బుద్దదేవ్ భట్టాచార్య సీపీఎం పార్టీ చివరి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 34ఏళ్లు సీపీఎం అధికారంలో ఉంటే బుద్దదేవ్ భట్టాచార్య ఒక్కరే పదకొండు ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
2000 నుంచి 2011 వరకు సుదీర్ఘకాలం 11 ఏళ్లపాటు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన మరణం పట్ల దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.