వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్ కమిటీలను శాసనమండలి చైర్మన్ షరీఫ్ నియమించారు. కొద్ది రోజులుగా ఈ అంశంపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు. శాసనమండలిలో ఆయా బిల్లులను పెట్టిన వారినే… చైర్మన్లుగా ఖరారు చేశారు. సీఆర్డీఏ రద్దు బిల్లు సెలక్ట్ కమిటీ చైర్మన్‌గా బొత్స సత్యనారాయణ, వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీ కి చైర్మన్ గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహరిస్తారు. సీఆర్డీఏ రద్దు బిల్లు సెలక్ట్ కమిటీలో సభ్యులుగా టీడీపీ సభ్యులైన దీపక్‌రెడ్డి, అర్జునుడు, రవిచంద్ర, శ్రీనివాసులు . వైసీపీ నుంచి మహ్మద్ ఇక్బాల్ , పీడీఎఫ్ నుంచి వెంకటేశ్వరరావు , బీజేపీ నుంచి సోము వీర్రాజు సభ్యులుగా ఉంటారు.
పరిపాలన వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీలో సభ్యులుగా లోకేష్, అశోక్‌బాబు, తిప్పేస్వామి, సంధ్యారాణి పీడీఎఫ్ నుంచి లక్ష్మణరావు , బీజేపీ నుంచి మాధవ్, వేణుగోపాల్‌రెడ్డిలను నియమించారు. సభ్యులుగా ఎవరెవర్ని నియమించాలో.. టీడీపీ, బీజేపీ , పీడీఎఫ్ పేర్లు ఇచ్చాయి కానీ… వైసీపీ మాత్రం ఇవ్వలేదు. అయితే.. బిల్లు పెట్టిన వారినే చైర్మన్ గా నియమించాలన్న సంప్రదాయం ఉండటంతో ఆ మేరకు..షరీఫ్ నియామక ప్రకటన చేశారు.
అయితే..ఇప్పటికే సెలక్ట్ కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం..తామూ భాగస్వామ్యం కాబోమని.. మండలి చైర్మన్‌కు బుగ్గన, పిల్లి సుభాష్, ఉమ్మారెడ్డి లేఖ రాశారు. అయినా షరీఫ్… నిబంధనల ప్రకారం… సెలక్ట్ కమిటీని ప్రకటించారు. సెలక్ట్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు..తెలిసిందని… కమిటీ చైర్మన్‌గా బాధ్యత స్వీకరించే పరిస్థితి లేదని బుగ్గన మీడియాకు స్పష్టం చేశారు. సెలక్ట్ కమిటీ చైర్మన్లు బాధ్యతలు తీసుకోకపోతే.. తదుపరి ఏం చేయాలన్నది… మండి చైర్మన్ నిర్ణయించే అవకాశం ఉంది.