బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ ఆర్థిక మంత్రి. ఆర్థిక వ్యవహారాలు మొత్తం ఆయనచేతుల మీదుగానే సాగాలి. అయితే ఆయన ఎక్కువగా ఢిల్లీలో ఉంటున్నారు. ఇక్కడ మాత్రం ఆర్థిక మంత్రి పని సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్నారు. చివరికి తీవ్ర వివాదానికి కారణమై.. సమ్మెకు సైతం వెళ్తున్న ఉద్యోగుల పీఆర్సీ విషయంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడా కనిపించడం లేదు. ఓ సందర్భంలో ఉద్యోగులు కూడా మాతో ఎవరెవరో మాట్లాడతామంటున్నారు.. ఆర్థిక మంత్రి లేకుండా ఏం మాట్లాడతామని ఆగ్రహం వ్యక్తం చే్యడంతో ఓ సారి ఆయనవచ్చారు. కానీ ఆయన అలా కూర్చుని వారు చెప్పింది విని వెళ్లిపోయారంతే.
ఇప్పుడు ఉద్యోగులకు నచ్చ చెబుతామంటూ ఓకమిటీని నియమిస్తే అందులోనూ బుగ్గన ఉన్నారు. కానీ వరుసగా రెండు రోజులు కమిటీ భేటీ అయినా బుగ్గన మాత్రం హాజరు కాలేదు. నిన్న ఢిల్లీలో ఉండగా.. ఇవాళ ఎక్కడ ఉన్నారో స్పష్టత లేదు. మళ్లీ ఆ నచ్చ చెప్పే కమిటీలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి డామినేషనే కనిపిస్తోంది. ఓ వైపు పేర్ని నాని.. మరో వైపు బొత్సలను పెట్టుకుని ఆయనే మీడియాతో మాట్లాడుతున్నారు.
ఉద్యోగులతో చర్చల ప్రక్రియ గురించి చెప్పేస్తున్నరు. బుగ్గనను ఎందుకు పీఆర్సీ విషయంలో ఇన్వాల్వ్ కానీయడం లేదో స్పష్టత లేదు కానీ.. మొత్తం సజ్జల చూస్తున్నారు కదా .. బుగ్గన ఎందుకునే అన్న పద్దతిలో వైసీపీ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వివాదం తనకెందుకే అని బుగ్గన కూడా సైలెంట్‌గా ఉండి.. ఢిల్లీ వెళ్లి ఎవర్ని కలిసి రమ్మంటే వారిని కలిసి విజ్ఞాపనులు చేసి వస్తున్నారు.