పేర్ని నాని పరారీ వ్యవహారాన్ని చూసి గోడౌన్ల వ్యాపారం చేస్తున్న ఇతర వైసీపీ నేతల్లోనూ టెన్షన్ పట్టుకుంది. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి చెందిన బేతంచర్ల గోడౌన్ల నుంచి కూడా పెద్ద ఎత్తున బియ్యం తరలిపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెంటనే స్పందించారు. ఆ గోడౌన్లతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే కొంత మంది తన బంధువులవి ఉండవచ్చని దానికి తానేం చేస్తానని అంటున్నారు.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎంత దాచి పెట్టుకున్నా బియ్యం భయం మాత్రం వెంటాడుతుందని ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది. ఆయన బంధువుల పేరు మీద గోడౌన్లు నడిచినా బియ్యం మాయం చేయగలిగారంటే తమ బంధువు బుగ్గన సపోర్టు లేకుండా సాధ్యమేనా ?. బుగ్గన వ్యవహారం వైసీపీలోనూ హాట్ టాపిక్ అవుతోంది. గోడౌన్లు నిర్మించి అద్దెకు ఇస్తున్నారని అనుకున్నారు కానీ అందులో సరుకును కూడా కొట్టేస్తున్నారని అనుకోలేదు.
బేతంచర్ల గిడ్డంగుల వ్యవహారంలో ఇప్పటికే విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభించిది. మాయమైన బియ్యం లెక్కలను బయటకు తీస్తోంది. అందుకే బుగ్గన బయటకు వచ్చి వివరణ ఇచ్చుకుంటున్నారు. గోడౌన్లను అక్కడి నుంచి తరలించి టీడీపీ నేతల గోడౌన్లలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మారిపోయినా సరే తమ గోడౌన్లలోనే బియ్యం ఉండాలని ఆయన అనుకుంటున్నారు కానీ.. అసలు కథ మాత్రం ప్రారంభమవుతుంది. పేర్ని లాగే బుగ్గన కూడా కొన్నాళ్లు కనబడకుండా పోవాల్సి ఉంటుందేమోనని కర్నూలులో సెటైర్లు వినిపిస్తున్నాయి.