అమరావతిలో అక్రమాలు చాలా ఉన్నాయని.. వాటిని త్వరలో బయటపెడతామంటూ.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొత్తగా చెప్పుకొచ్చారు. అసలు అమరావతినే భారీ స్కాం అని.. అధికారంలోకి రాక ముందు నుంచీ చెప్పుకుంటూ వచ్చిన వైసీపీ నేతలు.. అధికారం అందిన మరుక్షణం… నిపుణుల కమిటీలను నియమించారు. ఆరు వారాల గడువు ఇచ్చారు. రేమండ్ పీటర్ అనే… నిపుణుడు దీనికి నేతృత్వం వహించారు. ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. రూ. 30వేల కోట్ల అక్రమాలు జరిగాయని.. ఆ కమిటీ నివేదిక ఇచ్చిందని.. మీడియాకు.. ప్రభుత్వం వైపు నుంచి సమాచారం కూడా వచ్చింది. కానీ.. జరిగింది…రూ. ఆరు వేల కోట్ల పనులయితే.. రూ. 30వేల కోట్ల అక్రమాలేమిటని.. అందరూ ముక్కున వేలేసుకునే సరికి.. ఆ నివేదికను బయటకు రాకుండా చేశారు.
ఆరు నెలలయినా… అమరావతిలో … వైసీపీ నేతలు ఆరోపించినట్లుగా..ఇన్ సైడర్ ట్రేడింగ్…ఇతర అవినీతికి సంబంధించి.. ఒక్క వ్యవహారం బయట పెట్టకపోవడంతో.. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు.. విమర్శలు చేయడం ప్రారంభించారు. ఓ రకంగా టీజింగ్ చేస్తున్నారు. కానీ.. ఇప్పటికీ.. బుగ్గన సహా.. అందరూ ఆరోపణలకే పరిమితమవుతున్నారు కానీ.. ఫలానా అవినీతి జరిగిందని మాత్రం చెప్పలేకపోతున్నారు. నిజానికి.. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. 30వేల ఎకరాలు టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని.. ఆరోపించారు. సాక్షి పత్రికలో పేజీలకు పేజీలు కథనాలు రాశారు. తీరా.. అధికారంలోకి వచ్చి.. రికార్డులన్నీ.. చేతుల్లోకి వచ్చినా… అవినీతిని బయట పెట్టలేకపోయారు.
అమరావతిపై తాము చేసిన అవినీతి ఆరోపణలను ఎలాగైనా నిరూపించాలన్న పట్టుదలతో ప్రభుత్వం.. రెవిన్యూ, సీఐడీ అధికారులను ప్రయోగించింది. వారు రైతుల వద్దకు వెళ్లి.. వివరాలు తీసుకుని.. ఆధార్ కార్డులు.. ఇతర సరంజామా తీసుకుని.. రైతుల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అన్ని చేసినా.. ఇంత వరకూ.. ఎలాంటి అవినీతిని బయట పెట్టలేదు. కానీ ఎప్పుడు విమర్శలు వచ్చినా.. త్వరలో బయట పెడతామనే డైలాగ్‌ను వినిపిస్తున్నారు. బుగ్గన కూడా అదే చెబుతున్నారు. బొత్స కూడా అదే చెబుతున్నారు. ఆ త్వరలో ఎప్పుడు వస్తుందో.. అందులో అవినీతి ఏముంటుందో.. వైసీపీ నేతలకే తెలియాలి.