బుగ్గన రెడ్డి అంటే… ఆషామాషీ కాదు. ఆర్థిక మంత్రి. అప్పులు ఎన్ని పద్దతుల్లో ఎన్ని అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడాలో బాగా తెలుసు. గతంలో పువ్వులో తేనెని తేనెటిగ జుర్రుకున్నట్లుగా…. మనిషిలోని రక్తాన్ని పన్నుల రూపంలో జుర్రుకోవాలని అధికారులకు సలహా ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఓ ఆలోచన చేస్తున్నారు. అభివృద్ధి గురించి ప్రశ్నించే వారందరికీ ఆదాయపు పన్ను వేయాలట. ఆర్థిక మంత్రిగా ఉంటూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత ఊళ్లో చాలా కాలంగా డిమాండ్ ఉన్న రోడ్లనూ వేయలేకపోతున్నారు. వేసిన రోడ్లు పాడైపోతే కనీసం పట్టించుకున్న వారూ ఊండటం లేదు.
స్థానిక సంస్థల సమావేశాలు జరిగినప్పుడు ఆయన డబ్బుల మంత్రి .. ఆయన మంజూరు చేస్తారని స్థానిక ప్రజా ప్రతినిధులు ఆశపడుతూ ఉంటారు. అలాగే ఆయన అరుదుగా వెళ్లే గడప గడపకూ కార్యక్రమంలోనూ ఆయనను ప్రజలు నిలదీస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. ప్రతి ఒక్కరూ అభివృద్ధి గురించి మాట్లాడేస్తున్నారని వారందరికీ ఆదాయపు పన్ను విధించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రతి ఒక్కరూ ఆదాయపు పన్ను గురించి మాట్లాడేస్తున్నారని…. వారందరికీ కామెడీ అయిపోయిందని అంటున్నారు. అయితే… బుగ్గనకు.,. మిగతా వైసీపీ నేతలకు ఉన్న తేడా కూడా ఇదే. ఇతర నేతలు… అభివృద్ధి గురించి అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని అంటారు. కానీ.. బుగ్గన మాత్రం.. అలా అడిగే వాళ్లకు పన్నులు వేయాలని అంటున్నారు