తొలి సినిమా విడుదల కాకముందే.. అందరి కళ్లూ తన వైపుకు తిప్పుకొంది మెగా ప్రిన్సెస్ నిహారిక. ఒక మనసుతో ఈ మెగా డాటర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రామరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలకు సిద్ధమైంది. అవుట్ పుట్ చూసిన వాళ్లంతా నిహారిక పెర్ఫార్మ్సెన్స్కు స్టన్ అయిపోతున్నార్ట. ఈ సినిమా మొత్తాన్ని తానొక్కత్తే నడిపించేసిందని, ఈసినిమా చూసి, బయటకు వచ్చాక నిహారిక పేరు మాత్రమే గుర్తింటుందని ఈ సినిమా రషెష్ చూసిన కొంతమంది అప్పుడే కాంప్లిమెంట్లు విసిరేస్తున్నారు. మెగా టాటర్ సినిమా అంటే ఓపెనింగ్ కలక్షన్లు హోరెత్తడం ఖాయం. బన్నీ, చరణ్, వరుణ్తేజ్లాంటివాళ్లు ప్రమోషన్లకు దిగుతారు కాబట్టి ప్రచారం కూడా ఈజీగా జరిగిపోతుంది.
ఆ ధైర్యంతోనే కొంతమంది నిర్మాతలు అప్పుడు నిహారిక వెంట పడడం మొదలెట్టారు. ‘మా కథ వినండి.. మా కథ వినండి’ అంటూ చుట్టుమూగిపోతున్నారని టాక్. నాగబాబుకి నిర్మాతల ఒత్తిడి మరీ ఎక్కువగా ఉందని, ఓ పెద్ద దర్శకుడు నిహారిక కావాలంటూ.. నాగబాబు వెంట పడుతున్నాడని టాక్. అయితే నాగబాబు మాత్రం కాస్త స్ట్రాంగ్‌గానే ఉన్నాడు. ఒక మనసు ఫలితం చూశాక.. అప్పుడు రెండో సినిమా గురించి ఆలోచిస్తా అంటున్నాడట. ఆ సినిమా హిట్టయి, నిహారికకు మార్కులు పడిపోతే… నిహారిక బిజీ అవ్వడం ఖాయం.