టాలీవుడ్ రెండు వివాదాలు తెరపైకి వచ్చాయి. విశ్వక్ సేన్ ‘లైలా’ ఈవెంట్ లో 30 ఇయర్స్ పృధ్వీరాజ్ చేసిన కామెంట్స్ పొలిటికల్ గా హీట్ ని పెంచాయి. ఈ సినిమాలో మేకల సత్తి అనే క్యారెక్టర్ ని చేశారు పృధ్వీ. ఆ క్యారెక్టర్ గురించి చెబుతూ 150 మేకలకి 11 మేకలు మిగిలాయని సినిమాలోని ఓ సన్నివేశాని చెప్పారు. ఈ డైలాగ్ ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. ఒక్కసారిగా వైసీపీ సోషల్ మీడియా హ్యండిల్స్ లో ‘బ్యాన్ లైలా’ అనే పోస్టులు కనిపించాయి. కామెంట్ చేసింది పృధ్వీ అయితే.. హీరో, నిర్మాతని టార్గెట్ చేసుకొని పోస్టులు పెడుతున్నారు వైసిపీ అభిమానులు. సినిమా రిలీజ్ కి ముందు ఇలాంటి పరిమాణం రావడం యూనిట్ కాస్త ఇబ్బంది పెట్టిన విషయమే. దీనిపై ఈ రోజు విశ్వక్ ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఈ ప్రెస్ మీట్ లో మొత్తం వివాదంపై క్లారిటీ ఇచ్చే అవకాశం వుంది.
‘తండేల్’ సినిమా పైరసీ బారిన పడింది. నెల 7న థియేటర్లలో విడుదలైన ‘తండేల్’ను పైరసీ చేసి కొందరు ఆన్లైన్లో పెట్టారు. ఓ లోకల్ ఛానల్లోనూ ప్రసారమైంది. దీనిపై నిర్మాత బన్నీవాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. గీత ఆర్ట్స్’ సినిమాలను పైరసీ చేసిన వారిని, వాటిని డౌన్లోడ్ చేసుకుని చూసిన వారిని తేలిగ్గా వదిలేస్తామని అనుకోవద్దు. ఈ సినిమా పైరసీ చూసే వారు నాకు ఎక్కడ కనిపించినా కేసులు పెడతా’ అని హెచ్చరించారు. ఇదే అంశంపై ఈ రోజు ఆయన మీడియా ముందుకు వస్తున్నారు. పైరసీ విషయంలో తీసుకున్న చర్యలని మీడియాకి వివరించనన్నారు. మొత్తానికి ఈ రోజు రెండు వివాదాస్పద అంశాలు టాలీవుడ్ ని హెడ్ లైన్స్ లో నిలిపాయి.