`చెప్పను బ్రదర్` అనే ఒకే ఒక్క మాట… పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ని అల్లు అర్జున్ కి దూరం చేసింది. ఈ మాట బన్నీ నోటి నుంచి యధాలాపంగా వచ్చింది కాదని, ఇద్దరి మధ్యా గ్యాప్ ఉండబట్టే… ఈ మాట అన్నాడని ఆ తరవాత దాని చుట్టూ బోల్డంత చర్చ, రచ్చ నడిచింది. వవన్ – అల్లు అర్జున్ మధ్యమధ్యలో కలిశారు గానీ – ఆ ఎఫెక్షన్, ఎమోషన్ ఆ కొంతసేపే అన్నట్టు సాగింది వ్యవహారం. దాంతో… పవన్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ.. మెగా ఫ్యాన్స్ వేరైపోయారు.
అయితే పవన్ కల్యాణ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. అల్లు అర్జున్ ఓ ట్వీట్ చేశాడు. ఈ యేడాది పవన్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించాడు బన్నీ. ఈ ట్వీట్… పవన్ ఫ్యాన్స్‌ని కాస్త కూల్ చేస్తోందనే చెప్పాలి. హీరోల మధ్య గ్యాప్ రావడం సహజం. ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు కాబట్టి.. అది మరింత సర్వ సాధారణం. అయితే దాన్ని పూడ్చుకునే అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగపరచుకోవాలి. బన్నీ ఇప్పుడు అదే చేశాడు. అల్లు అర్జున్, పవన్ మధ్య ఈగో క్లాష్ ఏమైనా ఉందా? లేదా? అనేది పక్కన పెడితే, ప్రస్తుతానికి బన్నీ తన వైపు నుంచి లైన్ క్లియర్ చేసుకోగలిగాడు. పవన్ ఫ్యాన్స్ కి ఈ ట్వీట్ తో సమాధానం ఇచ్చినట్టే అనుకోవాలి.