ఆంధ్రప్రదేశ్‌లో పాలక పక్షం తెలుగుదేశం చేపట్టిన ఆపరేషన్ మరోసారి మొదలు కాబొతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది! ఇప్పటికే వైకాపా నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం ఆకర్షించింది. ఫిరాయింపుదారుల్లో ఓ ముగ్గురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే, గడచిన కొన్నాళ్లుగా ఆకర్ష్‌కు కాస్త విరామం ఇచ్చింది తేదెపా. ఇప్పుడు మరోసారి ఆకర్ష్‌ను తెరమీది తెస్తున్నట్టు సమాచారం. కృష్ణా జిల్లాలో ఇతర పార్టీలకు చెందిన కీలక నేతల్ని తమవైపు తిప్పుకోవాలన్న వ్యూహంతో తెలుగుదేశం ఆ విధంగా ముందుకు పోయే పరిస్థితి కనిపిస్తోంది! ఈ మధ్యనే కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు దేవినేని నెహ్రూని, ఆయన కుమారుడు అవినాష్‌ను కూడా దేశంలోకి ఆహ్వానించి, పచ్చతీర్థం ఇచ్చేశారు. ఇప్పుడు మరోసారి వైకాపా నేతల మీద దేశం ఫోకస్ పెట్టినట్టు చెప్పుకుంటున్నారు.
మాజీ ఉప సభాపతి బూరగడ్డ వేదవ్యాస్‌పై దేశం కన్ను పడిందని సమాచారం. ఆయన్ని తెలుగుదేశంలోకి ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి, గడచిన ఎన్నికల సమయంలోనే వేదవ్యాస్ తెలుగుదేశంలోకి చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ, అప్పటి పరిస్థితుల నేపథ్యంలో అనూహ్యంగా ఆయన వైకాపా నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. పెడన నియోజక వర్గం నుంచీ పోటీ చేసి, తెలుగుదేశం అభ్యర్థి కాగిత వెంకట్రావు చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత, ఆయన వైకాపాలో కీలక పాత్ర పోషించింది కూడా లేదనే చెప్పాలి. ఉన్నారంటే వైకాపాలో ఉన్నారని చెప్పుకోవడమే తప్ప, క్రియాశీలంగా వ్యవహరించిందీ లేదు. దీంతో ఆయన్ని ఆకర్షించేందుకు దేశం నేతలు తెరవెనక పావులు కదిపినట్టు సమాచారం.
తాజాగా బూరగడ్డ వేదవ్యాస్ తన అనుచరులూ అభిమానులతో సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తుపైనే ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు సమాచారం. పార్టీ మార్పు విషయమై తన అనుచరులతో చర్చించారనీ ఓ నిర్ణయం కూడా తీసుకున్నారని బలంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో త్వరలోనే వేదవ్యాస్ భేటీ కాబోతున్నారని కూడా చెబుతున్నారు. సో.. విషయం అంతవరకూ వచ్చిందటే… ఫిరాయింపు ఫిక్స్ అయినట్టే కదా! లాంఛనంగా చంద్రబాబును కలిసి, తెలుగుదేశంలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించబోతున్నారని చెబుతున్నారు. ఓరకంగా ఇది వైకాపాకి దెబ్బే అని చెప్పాలి. మొత్తానికి కృష్ణా జిల్లాలోని కీలక నేతలందరినీ తమవైపు తిప్పుకునేందుకు దేశం ప్రయత్నాలు చేస్తోందని చెప్పుకోవా