షిరిడి వెళ్తే అక్కడ వసతి సదుపాయం కోసం భక్తులు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు. అందుబాటులో సత్రాలుంటాయి. చాలా తక్కువ రుసుము తీసుకుంటారు. అదే కాశీకి వెళ్లినా వసతి కోసం వేల రూపాయలు.. ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు. చాలా తక్కువ ధరకే వసతి అందుబాటులో ఉంటుంది. మన రాష్ట్రంలో శ్రీశైలంకు వెళ్లినా అంతే. అక్కడ వసతితో పాటు ఉచిత భోజనం కూడా సత్రాల్లో పెడతారు. అదేం విచిత్రమో కానీ తిరుమలోల మాత్రం వసతి అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది… కాదు మార్చేస్తున్నారు. స్టార్ హోటళ్ల స్థాయిలో రూమ్ రెంట్లు పెంచేస్తున్నారు.
రూ. ఐదువందలు ఉండే రూమ్ చార్జీ తాజాగా పదిహేడు వందలకు పెంచారు. వంద ఉండే రూము చార్జీని త్వరలో ప దిహేను వందలు చేయబోతున్నారు. ఇప్పటికే రూముల రెంట్లను విపరీతంగా పెంచారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. వారి ఆధ్వర్యంలో ఏర్పడిన టీటీడీ బోర్డు ఏర్పడిన తర్వాత ఇలా ధరలు పెంచడం.. రెండో సారో.. మూడో సారో. భక్తులు తీవ్ర ఇబ్బంది పడతారని.. ఈ ఖర్చులు భరించలేక వచ్చే వారు తగ్గిపోతారన్న స్పృహ కూడా ఉండటం లేదు. సామాన్యులకు దేవుడ్ని దూరం చేయాలన్న లక్ష్యమో… వేల కోట్ల ఆస్తులు ఉండి.. అపరిమితమైన ఆదాయం వస్తున్నప్పటికీ.. ఇంకా ఇంకా సంపాదించాలన్న ఆశో కానీ టీటీడీ బోర్డు వర్గాలు మాత్రం ఈ దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ఓ కుటుంబం తిరుపతికి వెళ్లి రావాలంటే ఇప్పుడు కనీసం పదివేల రూపాయలు సులువుగా అయిపోతాయి. అంత కాస్ లీగా దేవుడి దర్శనాన్ని చేసేశారు. ఇప్పుడు రూముల ధరలను పెంచి.. సామాన్యులు దేవుడి వైపు చూడాలంటేనే భయపడేలా చేస్తున్నారు. సాధారణంగా తిరుమలలో రూములు పన్నెండు గంటల సమయానికే ఇస్తారు. భక్తులు వచ్చి రూమ్లో ఫ్రెష్ అయి దర్శనానికి వెళ్తారు. ఆ కొండ మీద చూసే దర్శనీయ స్థలాలు ఉంచే చూసుకుని.. వెంటనే రూమ్ వెకేట్ చేస్తారు. అంటే కేవలం ఫ్రె్ష్ అవడానికి మాత్రమే రూములు. ఈ విషయం తెలిసి కూడా భక్తుల్ని బాదేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు టీటీడీ బోర్డు !