రావణుని రాజ్యం అయిన శ్రీలంకలోనే… ఆ పని చేశారు.. రాముడి రాజ్యం అయిన భారత్‌లో… మీరు చేయలేరా..? ఇదీ… బీజేపీకి శత్రువులాంటి మిత్రుడు.. శివసేన నుంచి ఘాటుగా.. మిత్రపూర్వకంగా వచ్చిన హెచ్చరికలాంటి.. ప్రశ్న. ఆ పనేమిటంటే.. బురఖాను నిషేధించడం. శ్రీలంకలో ఉగ్రవాద దాడుల తర్వాత… అక్కడి ప్రభుత్వం… కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. ముఖాని దాచే.. ఎలాంటి వస్త్రాలంకరణను అనుమతించేది లేదని ప్రకటించింది. అయితే..నేరుగా బురఖా ఒక్కటే అనే ప్రస్తావన..అక్కడి ప్రభుత్వం తేలేదు. కానీ.. శ్రీలంక ప్రభుత్వ ఉద్దేశం మాత్రం బురఖాను నిషేధించడమే. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇది శివసేనకు బాగా నచ్చింది.
వెంటనే… బీజేపీ… బురఖాను నిషేధించే నిర్ణయం ఎందుకు తీసుకోదంటూ… ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు. శివసేన.. ఇలా చాలా సార్లు.. బీజేపీని ఇరుకున పెట్టింది. అయోధ్యలో రాముడి గుడి ఎందుకు నిర్మించలేకపోయారంటూ… కొంత కాలం క్రితం.. బీజేపీకి వ్యతిరేకంగా ఓ ఉద్యమం కూడా చేశారు. నేరుగా అయోధ్యకే వెళ్లి ర్యాలీలు కూడా నిర్వహించారు. అయితే అప్పట్లో పరిస్థితులు.. రెండు పార్టీల మధ్య అంత సానుకూలంగా లేవు. ఇప్పుడు మాత్రం.. సర్దుకున్నారు. కలసి పోటీ చేస్తున్నారు. ఈ సమయంలో… శివసేన మరోసారి… చిక్కుల్లో పడేసే ప్రయత్నం చేస్తున్నారు.
శివసేన డిమాండ్‌కు… బీజేపీలోని కొంత మంది అతివాద నేతల నుంచి అప్పుడే మద్దతు ప్రారంభమయింది. భోపాల్ నుంచి పోటీ చేస్తున్న సాధ్వీ ప్రజ్ఞాసింగ్.. శివసేన డిమాండ్‌కు మద్దతు ప్రకటించారు. మరికొంత మంది నేతలు కూడా.. ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. అయితే మహారాష్ట్రకు చెందిన ఎన్డీఏ మిత్రపక్షం … రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాందాస్ అథవాలే మాత్రం.. శివసేన అధ్యక్షుడి డిమాండ్‌ను తోసి పుచ్చారు. శివసేన డిమాండ్ కరెక్ట్ కాదన్నారు. మొత్తానికి శివసేన లేవనెత్తిన బురఖా వివాదం… బీజేపీని మరింత చిక్కుల్లో పడేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.