రచయితగా మార్మోగుతున్న పేరు బుర్రా సాయిమాధవ్. మహానటి తో ఆయనకు మరో హిట్ దక్కింది. సైరా, ఎన్టీఆర్ చిత్రాలకు ఆయనే రచయిత. ఇప్పుడు కొత్త పాత్రలోకి ప్రవేశించబోతున్నారు. త్వరలో ఆయన నిర్మాతగా మారుతున్నారు. అయితే సినిమాల కోసం కాదు. వెబ్ సిరీస్ల కోసం ‘సినిమా టాకీస్`’అనే పతాకంపై వెబ్ సిరీస్లు నిర్మించడానికి ఆయన రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఓ స్క్రిప్టు తయారైంది. దీనికి కథ, కథనం, మాటలు బుర్రా సాయిమాధవే అందిస్తున్నారు. ఈ సిరీస్ విజయవంతమైతే…. ఆయన్నుంచి మరిన్ని వెబ్ సిరీస్లు రావడం ఖాయం. బుర్రా దర్శకుడిగా మారతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే బుర్రా మాత్రం ప్రస్తుతం రచన, నిర్మాణంపైనే దృష్టి పెట్టారు. రచయితలు దర్శకులుగా మారి విజయాలు సాధించారు. నిర్మాణ రంగంలో అడుగుపెట్టడం చాలా అరుదు. మరి బుర్రా అదృష్టం ఎలా ఉందో చూడాలి.