చిరంజీవి 151వ చిత్రం ఉయ్యాల వాడ నరసింహారెడ్డి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. స్క్రిప్టు వెర్షన్ దాదాపు చివరి దశకు చేరుకొంది. ఇప్పడు డైలాగ్స్ విషయంలో కసరత్తుచేస్తున్నారు. ఇప్పటికే పరుచూరి బ్రదర్స్ `మాటల` పని పూర్తి చేసినా.. మరో హ్యాండ్ అవసరమని చిరు భావించాడట. అందుకోసం బుర్రా సాయిమాధవ్‌ని టీమ్‌లోకి చేర్చుకొన్నట్టు సమాచారం. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో బుర్రా అందించిన డైలాగులు డైనమేట్లలా పేలాయి. అంతకు ముందు కంచె, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రాలకు మాటలు రాశాడు బుర్రా. ఖైదీ నెం.150లో కొన్ని సీన్లకు రాత సాయం అందించాడు. ఆ పనితనం గుర్తించి చిరంజీవి స్వయంగా బుర్రాసాయిమాధవ్ని పిలిపించి కొన్ని సీన్లు అప్పగించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బుర్రా సాయిమాధవ్ అదే పనిలో ఉన్నారని, డైలాగులకు ఆయన మెరుగులు దిద్దుతున్నారని సమాచారం. ఆగస్టులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోగా నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసుకోవాల్సివుంది.