టాలీవుడ్లో ఇంచుమించుగా ఒకే కథతో రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అవే.. `బేబీ`, `బుట్టబొమ్మ`. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న బేబీ సినిమా పూర్తయిపోయింది. మారుతి ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ. ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఓ అమ్మాయిని ఇద్దరబ్బాయిలు ప్రేమించడం కథ. అందులో ఒకడు మంచోడు. మరొకడు చెడ్డోడు. సేమ్.. `బుట్టబొమ్మ` కథ కూడా ఇంతే. మలయాళ చిత్రం కప్పెలకి ఇది రీమేక్. ఇది కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీనే. కప్పెలలో ఉన్న గమ్మత్తేమిటంటే.. స్క్రీన్‌ని విలన్ గా కనిపించే వాడు.. హీరో. అప్పటి వరకూ హీరోగా కనిపించినవాడు క్లైమాక్స్‌లో విలన్ అవుతాడు. ఇంచుమించుగా `బేబీ` కూడా అలాంటి కథే. కాకపోతే.. బుట్టబొమ్మ కప్పెల అఫీషియల్ రీమేక్. కాబట్టి.. కాపీ ముద్ర పడదు. ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో ఏది ముందు విడుదల అవుతుందన్నదే పాయింట్. ముందు బేబీ వచ్చేస్తే, బుట్టబొమ్మ కథ కాపీ అనుకొనే ప్రమాదముంది. బుట్టబొమ్మ ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. చూస్తుంటే బేబీ కంటే ముందు.. బుట్టబొమ్మని రంగంలోకి దించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టే కనిపిస్తోంది. చూద్దాం.. వీటిలో ఏ సినిమా ముందు విడుదల అవుతుందో..?
అంటే సుందరానికీ, కృష్ణ వ్రింద విహారి సినిమా కథలు రెండూ ఒక్కటే అని.. అప్పట్లో ప్రచారం జరిగింది. అంటే సుందరానికీ వచ్చి వెళ్లిపోయింది. వచ్చే వారం… కృష్ణ వ్రింద రాబోతోంది. సో.. ఈ రెండు కథల్లో ఉన్న సారుప్యత ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.