కొన్ని పాటలు భలే కుదురుతాయి. దర్శకుడి శైలిని ఔపోసాన పట్టిన గీత రచయిత దొరికినప్పుడు మాత్రమే కొన్ని మ్యాజిక్కులు జరుగుతాయి. జులాయిలో ‘నానేడపుడితే నీకెటన్నా’ అనే పాట వింటే త్రివిక్రమ్ రాశాడేమో అనిపిస్తుంది. అదొక్కటే కాదు, త్రివిక్రమ్, రామజోగయ్య శాస్త్రి కాంబినేషన్లో వచ్చిన కొన్ని పాటల్ని చూస్తే – అందులో త్రివిక్రమ్ పంచ్, స్టైల్ పర్ఫెక్టుగా కనిపిస్తాయి. అదంతా… రామజోగయ్య శాస్త్రి మ్యాజిక్. ఇప్పుడు ‘అల… వైకుంఠపురములో’ కూడా ఓ పాట రాశారు శాస్త్రి. బుట్టబొమ్మ… అంటూ సాగే ఈ గీతాన్ని ఈరోజు విడుదల చేసింది చిత్రబృందం.
ఈ పాట ఆసాందం వింటే… అందులో త్రివిక్రమ్ ఛమక్కు కనిపిస్తుంది.
‘అమ్ము..’ అంటూ హుక్ లైన్ పట్టుకుని, సింపిల్ ట్యూన్తో.. హాయిగా సాగిన పాట ఇది.
ఇంతకంటే మంచి పోలికేదీ నాకు
తట్టలేదు గాని అమ్ము
ఈ లవ్వనేది బబులు గమ్ము
అంటుకున్నదంటే పోదు – నమ్ము అంటూ గమ్మత్తుగా సాగింది.
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము
ప్రేమనాపలేవు నన్ను నమ్ము – అంటూ ప్రాసలతో ఆడుకున్నారు శాస్త్రి..
మల్టీప్లెక్సులోని ఆడియెన్సులాగా
మౌనంగున్నా గాని అమ్ము
లోన దండనక జరిగిందే నమ్ము
దిమ్మదిరిగినాదే మైండు సిమ్ము – అంటూ అల్లరి చేస్తూ సాగిందీ పాట
చరణంలోపూర్తిగా రామజోగయ్య మ్యాజిక్ కనిపించింది.
రాజుల కాలం కాదు రధమూ లేదు గుర్రం లేవు
అద్దం ముందుర నాతో నేనే యుద్ధం చేస్తాంటే
గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు
పెంపల్లో చిటికేసి నన్ను చక్కర వర్తిని చేశావే – అనడం బాగుంది.
చిన్నగా చినుకు తుంపర అడిగితే
కుండపోతాగా తుపానుతెస్తివే
మాటగా ఓ మల్లెపువ్వునడిగితే
మూటగా పూలతోటగా పైనొచి్చ పడితివే… అంటూ ఈ పాటని ముగించిన విధానం బాగుంది.
మొత్తానికి ఈ ఆల్బమ్ నుంచి మరో వెరైటీ పాటొచ్చింది. ఇక త్రివిక్రమ్ దాన్ని తనదైన స్టైల్లో ఎలా తీస్తారో చూడాలి.