ఇళ్లు కొని అద్దెలకు ఇచ్చుకుంటే మంచి ఇన్ కం వస్తుందని చాలా మంది ఆ పని చేస్తూంటారు. అయితే హోమ్ లోన్లు తీసుకుని మరీ ఇల్లు కొని అద్దె ఆదాయం కోసం ఇస్తే ఎంత వర్కవుట్ అవుతుందన్న దానిపై చాలా సందేహాలు ఉన్నాయి. కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొంటే పాతిక వేలు మాత్రమే అద్దె వస్తుంది. కానీ కట్టాల్సిన ఈఎంఐ అంతకంటే రెండింతలు ఉంటుంది. మొత్తంగా ఇంటి మీద పెట్టేది కోటి అయితే.. వచ్చే ఆదాయం పాతిక వేలు అనుకుందాం. అది ఏ మాత్రం గిట్టుబాటు అయ్యేది కాదనుకోవచ్చు. హోమ్ లోన్ తీసుకుంటే ఇంకా భారం. అది నిరర్ధక పెట్టుబడిగా మారినా ఆశ్చర్యం లేదు.
అయితే అన్ని చోట్లా ఇది వర్తించదు. ఇల్లు కొనే చాలా మంది కొనుగోలుదారులు గృహ రుణ తీసుకుంటున్నారు. ఇప్పుడు చూడాల్సిన విషయం ఏమిటంటే… మన దేశంలో ఆస్తుల అద్దె ఆదాయం 3-3.5 శాతం ఉండగా, గృహ రుణంపై వడ్డీ 8.25-50 శాతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అధిక వడ్డీకి ఇల్లు కొంటే ప్రయోజనం ఉండదు. కొని రెంట్ కు ఇచస్తే ఎంత ఆదాయం వస్తుంది.. ఎంత ఈఎంఐ చెల్లించాలన్నది లెక్క వేసి చూడండి. ఈ రెండింటి మధ్య భారీ వ్యత్యాసం ఉంటే కొనకపోవడం మంచిది.
కానీ మీరు కొనే ఇల్లు విలువను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇవాళ కోటి రూపాయలు ఉన్న ఆస్తి విలువ వచ్చే ఐదేళ్లకు రెండు కోట్లు అవుతుందని అనుకుందాం. రియల్ ఎస్టేట్ లో ఖచ్చితంగా రేట్లు పెరుగుతూనే ఉంటాయి..తగ్గుదల ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆస్తి విలువపెరుగుతుంది. భారీగా ఎక్కడ పెరుగుతుందో చూసుకుని అక్కడ కొని రెంట్ కు ఇస్తే లాభదాయమే అవుతుంది. కట్టే ఈఎంఐలో సగం కూడా అద్దే రాకపోయినప్పటికీ పెరిగే విలువను దాన్ని కవర్ చేస్తుంది.
అందుకే ఇంటిపైన పెట్టుబడికి రెండు రకాల ఆదాయం వస్తుంది. అద్దెతో పాటు ఆ ఇంటి విలువ కూడా నిరంతరంగా పెరుగుతుంది. ఇప్పుడు పాతిక వేలు వచ్చే అద్దె ఐదేళ్లకు నలభై వేలు కావొచ్చు. ఆస్తి విలువ రెండు కోట్లు అవుతుంది. దీన్ని లెక్కలేసుకుని ఇల్లు కొనుగోలు చేసి అద్దెలకు ఇచ్చుకుంటే మంచి లాభమే వస్తుంది. భవిష్యత్ లో నికర ఆదాయమూ ఉంటుంది.