ఇళ్ల కొనుగోలుదారులు రెండు రకాలుగా ఉంటారు. తాము ఉండటం కోసం మొదటి సారి ఇల్లు కొనుగోలు చేసేవారు మొదటి రకం అయితే.. అద్దెల ఆదాయం కోసం ఇళ్లు కొనాలనుకునేవారు రెండో రకం. ఇప్పుడు చాలా మంది అధికాదాయవర్గాలు తాము ఉండేందుకు మంచి కంఫర్టబుల్ హౌస్‌ను ముందుగానే సమకూర్చుకుంటున్నారు. తర్వాత తమ ఆదాయంతో రియల్ ఎస్టేట్ పై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ పెట్టుబడులు స్థలాల మీద పెట్టేవారు ఎక్కువ. అయితే ఆదాయం కూడా ఉండాలనుకునేవారు ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు.
అయితే శివారులో ఖాళీ స్థలాలు కొనడం కంటే ఇళ్లు కొనడం చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకుని ఉంటుంది. ఉదాహరణకు ఓ అపార్టుమెంట్ అపార్టుమెంట్ అరవై లక్షలు పెట్టి కొనుగోలు చేస్తే రూ. పదిహేను వేల వేరకూ అద్దె వస్తుంది. ఇది అరవై లక్షల పెట్టుబడి ఆధారంగా చూస్తే బ్యాంకు వడ్డీ కూడా కాదు. కానీ దీర్ఘకాలంలో చూస్తే ఆ ఇంటి విలువ పెరుగుతుంది. వచ్చే అద్దెల ఆదాయం పెరుగుతుంది. పదేళ్ల తర్వాత ఇంటి అద్దె కనీసం రూ. 30వేలు అవుతుంది. ఇంటి విలువ రూ. కోటిపైనే అవుతుంది. అంటే ఇప్పుడు పెట్టే పెట్టుబడితో విలువ, ఆదాయం పెరుగుతూనే పోతుంది. అందుకే ఇలాంటిపెట్టుబడి సురక్షితం. కానీ అప్పులు చేసి పెట్టకూడదు.
అయితే ఇది మధ్యతరగతి ఇళ్లకు వర్తిస్తుంది. లగ్జరీ ఇళ్లు కొని అద్దెలకు ఇచ్చుకుంటే పదేళ్ల తర్వాత కూడా పెట్టి పెట్టుబడిని మాత్రమే రాబట్టుకోగలమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఏ హైరైజ్ అపార్టుమెంట్ లో చూసినా కనీసం రూ. రెండు కోట్లకు డబుల్ బెడ్ రూంఫ్లాట్ వస్తుంది. దాన్ని కొని రెంట్ కు ఇస్తే.. నలభై వేల నుంచి యాభై వేల వరకూ వస్తుందని అనుకోవచ్చు. రూ. రెండు కోట్ల పెట్టుబడికి నెలకు యాభై వేల ఆదాయం అంటే నష్టమే. పదేళ్ల తర్వాత ఆ ఆపార్టుమెంట్ వాల్యూ ఏమైనా నాలుగు కోట్లకు చేరుతుందా అంటే… అలాంటి అవకాశం లేదని నిపుణుల అంచనా.
నివాసాలు లేని చోట ఖాళీ స్థలాలు కొనడం కన్నా.. ఇల్లు కొని అద్దెలకు ఇచ్చుకోవడం మంచి ఆప్షనే. కానీ దానికి తగ్గ పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది.