ఇల్లు ఎవరికైనా ఉండటానికి ఎంత అనుకూలంగా ఉండాలో.. తాము పెట్టిన పెట్టుబడికి అంతకు రెట్టింపు విలువ పెరగాలని కోరుకోని వారు ఉండరు. నివాసం ఉన్నప్పటికీ ఎప్పటికైనా అవసరం వస్తే.. మార్కెట్ రేటుతో పోటీ పడేలా తమ ఇంటి విలువ పెరిగే చోట ఇల్లు కొనాలని తిరిగేవారు అనేక మంది ఉంటారు. కానీ బడ్జెట్ పరిమితులు ఉంటాయి. అలాంటి వారు హై డిమాండ్ ఏరియాకు దగ్గరగా కొనుగోలుకు ఉపక్రమిస్తూంటారు.
ఇప్పుడు హైదరాబాద్‌లో అంతా కోకాపేట కబుర్లే. వరల్డ్ క్లాస్ నిర్మాణాలు, హై రైజ్ అపార్టుమెంట్లు.. పెద్ద పెద్ద కంపెనీలు.. ఐటీ కారిడార్లతో అనుబంధానం ఇలా చెప్పుకుంటే.. కోకాపేట వైపే అందరి చూపు ఉంది. కానీ అది మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేదు. కానీ అక్కడికి సమీపంలోనే ఉన్న కొల్లూరులో మాత్రం అందుబాటులో ఉన్నాయి. కొంతకాలం తర్వాత కొల్లూరు, కోకాపేట అనుసంధానం అయిపోతాయన్నంతగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఆ గ్రామ పరధిలో వస్తున్నాయి.
స్థిర నివాసానికైనా.. పెట్టుబడికైనా.. కోకాపేట్ తర్వాత అత్యంత ప్రామాణికమైన ప్రాంతంగా ఇప్పటికే కొల్లూరును రియల్ ఎస్టేట్ డెవలపర్లు గుర్తించారు. వరుసగా ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న ఈ ప్రాంతంలో లేని సౌకర్యాలు లేవు. ఐదారు ఇంటర్నేషన్ స్కూల్స్ తో పాటు ఐటీ కారిడార్‌కు పర్ ఫెక్ట్ కనెక్టివిటీ ఉంది. రణగొణధ్వనులు అనే బాధ ఉండదు.
టీఎస్పీఏ జంక్షన్ నుంచి ఏర్పాటు చేసిన సోలార్ సైకిల్ ట్రాక్ కొల్లూరు వరకూ ఉంది. ఇక్కడ రెరా అనుమతి పొందిన సంస్థలు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టాయి. ఇప్పుడు ధరలు కోకాపేటతో పోలిస్తే తక్కువకే వస్తున్నాయి. వచ్చే ఏడాది, రెండేళ్లలో కోకాపేటతో పోటీ పడే పరిస్థితి వస్తుందని అంచనాలు ఉన్నాయి.