ఆస్తుల చుట్టూ వివాదాలు ఉంటే అదో పెద్ద సమస్య అవుతుంది. అందుకే ఎలాంటి సమస్య లేకుండా.. రాకుండా ఉండే ఆస్తులనే కొంటారు. అందుకే ప్రభుత్వాలు వేలం వేసే ఆస్తులు, బ్యాంకులు వేలం వేసే ఆస్తులకు మంచి డిమాండ్ ఉంటుంది. అన్నీ చూసుకున్న తర్వాతనే అవి అమ్ముతారన్న నమ్మకం. బ్యాంకులకు చాలా మంది ఆస్తులు తాకట్టు పెట్టి చెల్లించడం మానేస్తారు. చివరికి డిఫాల్టర్లుగా మారుతారు. అలాంటి ఆస్తుల్ని బ్యాంకులు వేలం వేసి అప్పు ఖాతాకు జమ చేసుకుంటాయి.
ఇలా బ్యాంకులన్నీ కలిపి ఓ ప్రత్యేకంగా పోర్టల్ ను ప్రారంభించాయి. ఈ పోర్టల్ పేరు బ్యాంక్‌నెట్ ). ప్రభుత్వ రంగ బ్యాంకులు , ఇతర ప్రభుత్వ సంస్థలు జప్తు చేసిన ఆస్తులను బ్యాంక్‌నెట్ పోర్టల్‌లో ఇ-వేలం ద్వారా విక్రయిస్తారు. ఈ ఆస్తుల లిస్ట్‌లో… వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, వాణిజ్య ఆస్తులు, దుకాణాలు, పారిశ్రామిక ప్లాట్లు వంటివన్నీ ఉంటాయి.
సాధారణంగా, బ్యాంక్ లేదా ప్రభుత్వ సంస్థ తాను జప్తు చేసి, వేలం వేయబోయే ఆస్తుల గురించి తన వెబ్సైట్లో మాత్రమే చూపుతుంది. ప్రజలు అలాంటి ఆస్తుల కోసం ప్రతి బ్యాంక్ వెబ్‌సైట్‌ను విడివిడిగా చెక్ చేస్తుండాలి. ఇలా కాకుండా అన్ని బ్యాంకుల వేలాన్ని ఒక వేదికపై తేవాలని నిర్ణయించింది. ఇ-వేలం చేయబోయే ఆస్తులను ఒకే వేదికపై చేర్చారు. వేలానికి ఉన్న అన్ని రకాల ఆస్తుల వివరాలు బ్యాంక్‌నెట్ పోర్టల్‌లో కనిపిస్తాయి ఇ-వేలం షెడ్యూల్ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది, మీరు ఈ పబ్లిక్ డొమైన్లో మొత్తం సమాచారాన్ని పొందొచ్చు.
ఈ వేలంలో పాల్గొన్న ఆస్తులకు ఆయా బ్యాంకులు పూర్తి బాధ్యత వహిస్తాయి. అందుకే ఇవి పూర్తిగా సురక్షితమైన ఆస్తులు అనుకోవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే.. ఇవి తక్కువకే లభిస్తాయన్న అభిప్రాయం రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఉంది.