ఎడ్యూటెక్ కంపెనీ బైజూస్ మరోసారి తన కంపెనీలో పని చేస్తున్న పదిహేను వందల మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపేసింది. గత ఏడాదే వేయి మందిని తొలగించింది. ఇప్పుడు మరో పదిహేను వందల మందిని తొలగించింది. గతంలో ఉద్యోగుల్ని తీసేస్తున్నప్పుడు.. తప్పలేదని.. ఇక ఎవర్నీ తొలగించబోమని బైజూస్ చీఫ్ రవీంద్రన్ హామీ ఇచ్చారు. కానీై ఆయన నిలుపుకోలేకపోయారు.
బైజూస్ ఇటీవలి కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. యూనికార్న్ స్టార్టప్ గా ఎదిగిన తర్వాత దారి తప్పినట్లుగా ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వేల కోట్ల నష్టం ప్రకటిస్తోంది. ఉద్యోగుల్ని తొలగిస్తోంది. వ్యాపారం కోసం.. విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఆదాయం కూడా పడిపోయింది. కరోనా సమయంలో అందరూ ఆన్ లైన్ చదువులపై ఆసక్తి చూపడంతో బైజూస్ కు వ్యాపారం పెరిగింది. కానీ ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. బైజూస్ కంటెంట్ క్వాలిటీపై కూడా ఎవరికీ నమ్మకం ఏర్పడలేదు. దీంతో వినియోగదారులు తగ్గిపోయారు.
ఓ వైపు అప్పులు పెరిగిపోవడం.. కంపెనీై నిర్వహణలో చేసిన పొరపాట్లు..అప్పులు.. వినియోగదారులు తగ్గిపోవడంతో బైజూస్ ఒత్తిడికి గురవుతోంది. ఉద్యోగుల్ని తొలగించి.. కావాల్సిన పనులను ఔట్ సోర్సింగ్ ద్వారా చేయించుకుంటామని చెబుతోంది. కారణం ఏదైనా.. బైజూస్ ముందు ముందు తీవర్ సంక్షోభంలో కూరుకుతున్న సూచనలు కనిపిస్తున్నాయన్న అభిప్రాయం టెక్ ప్రపంచంలో ఉంది.