నీ నెత్తి మీద రూపాయి పెడితే పావలా విలువ కూడా చేయవని పనికి మాలిన వాళ్లను ఉద్దేశించి కొత మంది తిడుతూ ఉంటారు. ఇలాంటి తిట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏపీకి పిలిపించి ప్రజాధనం దోచి పెట్టిన బైజూస్‌కు కూడా వర్తిస్తుంది. అయితే బైజూస్ స్థాయి.. రూపాయి కాదు.. వేల కోట్లు. బైజూస్‌లో రూ.4వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ ప్రోసస్ ఎన్వి నిండా మునిగినట్లు ప్రకటించింది. 2018లోని తమ పెట్టుబడులు ఇప్పుడు సున్నా విలువకు పడిపోయినట్లు తెలిపింది.
తాము బైజూస్‌లో పెట్టిన పెట్టుబడుల వాటాను రైటాఫ్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. బైజూస్ ఆర్థిక పరిస్థితులు, అప్పులు, భవిష్యత్ అంచనాలకు సంబంధించి తమవద్ద ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆ సంస్థ విలువను తాము సున్నాకు తగ్గిస్తున్నట్లు ప్రోసస్ తెలిపింది. తద్వారా తమకు 493 మిలియన్ డాలర్లు అంటే రూ.4వేల కోట్లుకుపైగా మేర నష్టం వాటిల్లినట్లు ఆ కంపెనీ నెదర్లాండ్స్ స్టాక్ మార్కెట్ కు తెలిపింది.
ఇది ఒక్కటే కాదు.. అసలు ఇప్పుడు బైజూస్ కంపెనీకి వాల్యూనే లేకుండా పోయింది. ఆదాయం లేకపోగా వేల కోట్లు అప్పులు ఉన్నాయి, అమెరికాలోనూ కేసులు ఉన్నాయి. అలా ఇన్వెస్ట్ మెంట్లు, అప్పులు ఏం చేశారో ఎవరికీ తెలియదు . ఈడీ విచారణలోనూ తేలడం లేదు. మొత్తంగా జగన్ రెడ్డి సర్కార్ తో ఒప్పందానికి వచ్చే వరకూ కాస్త పర్వాలేదనుకున్న కంపెనీ ఇప్పుడు జీరోకు చేరిపోయింది.