రాయలసీమ రాజకీయాల్లో ఫ్యాక్షన్ ముద్ర ఉన్నప్పటికీ ఆ ప్రాంత హక్కుల కోసం పోరాడే నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఏ పార్టీలో ఉన్నా ఆయన స్టైల్ వేరుగా ఉంటుంది. ప్రస్తుతం ఆయన మరోసారి రాయలసీమ హక్కుల కోసం ఉద్యమం చేస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న ఎగువభద్ర ప్రాజెక్ట్ నిర్మితమైతే సీమ ఎడారిగా మారడం ఖాయమని ఆయన భావిస్తున్నారు నికర జలాల పరిరక్షణ కోసం బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద నుండి మహా పాదయాత్ర చేపట్టారు. ఎగువభద్ర ప్రాజెక్టులపై రాయలసీమ రైతాంగంలో ఆందోళన ఉంది.
ఎగువ భద్ర ప్రాజెక్ట్‌పై సీమ ప్రాంత ఎమ్మెల్యేలు నోరు విప్పకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరిస్తున్నారు. రాజకీయ భవిష్యత్తు ముఖ్యం కాదని, రాయలసీమ ప్రజల బతుకే ముఖ్యమని .. మార్చి మొదటి వారంలో రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో ఎగువ భద్రకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సంతకాల సేకరించి ప్రధానికి పంపుతామని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చెబుతున్నారు. కర్ణాటకలో ప్రస్తుతం భద్రావతి నది పై భాగాన కర్ణాటక పశ్చిమ ప్రాంతంలో ‘అప్పర్ భద్ర’ మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. నీటి కేటాయింపులు లేకపోయినా కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. జాతీయ హోదా ఇచ్చింది.
ఇది పూర్తయితే దిగువనున్న హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, పోతిరెడ్డిపాడు, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కింద వున్న ఆయకట్టు పూర్తిగా నష్టపోతుందని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర అభ్యంతరాలు పెట్టాయి. అయితే ఈ అభ్యంతరాలను కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ‘అప్పర్ భద్ర’ నిర్మాణానికి సిద్ధమైంది. జాతీయ హోదా ప్రకటించి నిధులు కూడా విడుదల చేయడంతో రాయలసీమ రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. కానీ రాజకీయ పార్టీలు మాత్రం సైలెంట్ గా ఉంటున్నాయి. కొంత మంది మాత్రమే రోడ్డెక్కుతున్నారు. ప్రజలు, రైతులు రోడ్డెక్కితే ప్రభుత్వానికి ఇబ్బందిక పరిస్థితులు ఏర్పడతాయి. అందుకనే వైసీపీ నేతుల సైలెంట్ గా ఉంటున్నారన్న వాదన వినిపిస్తోంది.