సినీ పరిశ్రమ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్లో అప్రూవ్ చేసిన ప్యాకేజీని మెగాస్టార్ చిరంజీవి క్షణం ఆలస్యం చేయకుండా పొగిడేశారు. చిరంజీవి పొడిగే వరకూ.. సినీ పరిశ్రమకు ఏపీ సర్కార్ ఏదో మేలు చేసిందనే విషయం చాలా మందికి తెలియదు. తర్వాత చెక్ చేసుకుంటే… ధియేటర్లకు రెండు నెలల కరెంటు బిల్లుల ఫిక్స్డ్ చార్జీల రద్దుతో పాటు.. కొంతరుణం ఇవ్వబోతున్నారని తేలింది. దానికి చిరంజీవి అదే మహా ప్రసాదం అన్నట్లుగా పొగడ్తలు కురిపించేస్తూ ట్వీట్లు పెట్టారు. దాంతో.. సినీ పరిశ్రమలోని ఇతరులు నోరెత్తలేకపోయారు. కానీ సి. కల్యాణ్ మాత్రం తెర ముందుకు వచ్చారు.
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అసలు ఏ మాత్రం వర్కవుట్ కాదని తేల్చేశారు. ఏపీ ప్రభుత్వం ఇండస్ట్రీకి అసలేమీ ఇవ్వలేదని.. ధియేటర్లకు మాత్రం కాస్త వెసులుబాటుకల్పించారని దాని వల్ల… సినీ పరిశ్రమకు ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. అదే సమయంలో… తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని ఆయన గుర్తు చేస్తున్నారు. చిన్న సినిమాలు ఇచ్చిన రాయితీలు.. అలాగే.. వివిధ సినిమాల షూటింగ్‌లు.. జీఎస్టీల విషయంలో ఇచ్చిన మినహాయింపులను గుర్తు చేసి.. అలాంటివి ఇవ్వాలని అంటున్నారు. ఇవేమీ ప్రకటించకుండా… ధియేటర్లకు కొద్దిగా ప్రయోజనం కల్పించి.. అదే సినిమా ఇండస్ట్రీకి చేసిన మేలు అంటే ఎట్లా అని సి.కల్యాణ్ ప్రశ్నిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. కొన్ని మేళ్లు చేయాలని ఆయన కోరుతున్నారు. అయితే.. ఆయన సాఫ్ట్‌గానే ఇవన్నీ చెబుతున్నారు. త్వరలో చిత్ర పరిశ్రమ తరపున.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సన్మాన కార్యక్రమం లాంటిది ఏర్పాటుచేస్తామని అంటున్నారు. చిరంజీవి పొగడ్తులు కురించినందున ఇక ఎవరూ ఏపీ సర్కార్ నిర్ణయాలపై నోరు తెరవకుండా.. పొగడ్తలు కురిపిస్తారని అనుకున్నారు కానీ… ఆశలు పెట్టుకున్న నిర్మాతలకు షాక్ తగలడంతో… తమ డిమాండ్లు వినిపించడం ప్రారంభించేశారు.