2019 సార్వత్రకి ఎన్నికల్లో మళ్లీ నరేంద్రమోడీ ప్రధానమంత్రి అవుతారని… ఏబీపీ -సీ-ఓటర్ సర్వే వెల్లడించింది. అయితే.. ఈ సర్వేలో వివిధ రాష్ట్రాల్లో పొత్తుల పరిస్థితులు క్లారిటీగా లేనందున.. ఫలితం మారొచ్చని అంచనా వేసింది. గత లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా మెజార్టీ సాధించింది. ఈ సారి మాత్రం అది సాధ్యం కాదు. బీజేపీకి పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉంటే.. మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ 291 సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయని యూపీఏకి 171 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది. అయితే బీజేపీకి ఈ పలితాలు రావాలంటే.. అనేక పరిస్థితులు కలసి రావాలి. విపక్షాలు ఏకం కాకుండా ఉండాలి.
80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్ కీలకం కానుంది. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ , మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే మాత్రం ఎన్డీఏ సీట్లు 247 సీట్లు మాత్రమే దక్కుతాయి. ఇదే కనుక జరిగితే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 272 సీట్ల మెజార్టీ ఎన్డీఏకు దక్కనట్ల. అదే సమయంలో ఈ సర్వే ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ… మెజార్టీ సీట్లు.. అంటే దాదాపుగా.. గత ఎన్నికల్లో సాధించినన్ని సీట్లు బీజేపీ సాధిస్తుందని అంచనావేసింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 లోక్‌సభ స్థానాలు ఉండగా అందులో 23, రాజస్థాన్‌లోని 25 సీట్లలో 19 సీట్లు, ఛత్తీస్‌గఢ్‌లోని 11 సీట్లలో ఐదింటిని దక్కించుకుంటుందని సర్వే అంచనా వేసింది.ఒడిశాలో ఇప్పుడు ఉన్న ఒక్క సీటు నుంచి ఏకగా పదిహేను స్థానాలకు ఎగబాకుతుందని అంచనా వేసింది. బిహార్‌లో క్లీన్ స్వీప్ చేస్తుందని స్రవే అంచనా వేసింది. అలాగే బెంగాల్ లో 9 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇవన్నీ మ్యాగ్జిమం సీట్లు. ఎన్ని సీట్లు తగ్గిపోతే బీజేపీ అంత రిస్క్ లో పడిపోతుంది.
దక్షిణాదిలో మాత్రం బీజేపీకి ఎలాంటి అవకాశం కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో కలిపి మొత్తం 129 లోక్‌సభ సీట్లు ఉండగా అందులో 15 స్థానాల్లో మాత్రమే వస్తాయని అంచనా వేసింది. కానీ.. ఒక్క కర్ణాటకలో మాత్రమే.. సీట్లు వచ్చే పరిస్థితి బీజేపీకి ఉంది.అక్కడ కూడా కాంగ్రెస్, జేడీఎస్ కలసి పోటీ చేస్తే.. సింగిల్ డిజిట్ కు పరిమితం కానుంది. తమిళనాడులో డీఎంకే, ఏపీలో టీడీపీకి అత్యధిక సీట్లు లభిస్తాయని సీ ఓటర్ అంచనా వేసింది.