స్థానిక సంస్థల నుంచి శాసనసభ నుంచి పోటీ చేసే ఎంఎల్‌సి అభ్యర్థులను ముఖ్యమంత్రి ప్రకటించడం లోకేశ్‌తో సహా ఏడుగురు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగిపోయింది. స్థానిక సంస్థల, పట్టభద్రులూ ఉపాధ్యాయుల ఫలితాలు కూడా వస్తాయి. స్థానిక సంస్థల్లో తప్ప మిగిలిన వాటిలో పాలకపక్షం పెద్ద ఫలితాలు సాధించే అవకాశం లేదు. ఇవే గాక గవర్నర్ నామినేట్ చేసేవి కూడా వున్నాయి. పోటీలు ఖర్చుల బెడదలేకుండా ఆ మార్గంలో వచ్చేద్దామని ఆశపడేవారు చాలా మంది వుంటారు. చంద్రబాబు లోకేశ్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే ఈ సారి అకామిడేట్ చేయడం చాలా టైట్‌గా వుందని ఎవరూ ఆశలు పెట్టుకోవద్దని అధిష్టానం సంకేతాలు పంపించిందట. సో ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్లు నీరుగారి పోయారు. ఏమంటే ఎంఎల్‌సి గ్యారంటీ అనే ఆశతో ఖర్చులు పెంచడమే గాక కొంతమంది నేతలు దూకుడుగా కూడా వ్యవహరించారు. ఈ కోటా కాకుంటే ఆకోటా అని ఎదరుచూస్తూ కూచున్నారు. తీరా ఇప్పుడు ఆశలే వద్దని అధిష్టానం ఆదేశించాక చేతులు ఎత్తేయక తప్పలేదు. ఎవరెవరో పార్టీ బయిటనుంచివచ్చిన వారు స్థానాలు తీసేసుకుంటుంటే తాము ప్రేక్షకుల్లా మిగిలిపోతున్నామని వీరంతా ఆవేదన చెందుతున్నారు.అయితే ఎల్లకాలం ఇలాగే వుంబడోమనీ తగు సమయం చూసి పార్టీ శ్రేణులే పాఠం చెబుతాయని అంటున్నారు. ప్రతిసారి తమకు వారే ఆశలు కల్పిస్తారని ఇదుగో అదుగో అని ఆఖరుకు మొండి చెయ్యి చూపిస్తుంటారని ఈ నిరంతర నిరీక్షక కూటమి గగ్గోలు పెడుతున్నది.