తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాలు అంచనా వేయడం కష్టమే. ఆయన వేసే అడుగుల్ని బట్టి రాజకీయ విశ్లేషకులందరూ.. ఓహో అలా చేస్తున్నారా అని అనుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన వచ్చే నెల మూడో తేదీన మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఇది రొటీనే. ఎప్పుడూ జరిగే మంత్రి వర్గ సమావేశమే కదా అనుకోవచ్చు. కానీ అదే రోజు టీఆర్ఎస్ ఎల్పీ భేటీ కూడా ఏర్పాటు చేశారు. ముందు కేబినెట్ భేటీ జరుగుతుంది. తర్వాత టీఆర్ఎస్ ఎల్పీ భేటీ జరుగుతుంది.
మామూలుగా అయితే కేబినెట్ భేటీల్ని గంటల తరబడి నిర్వహిస్తూ ఉంటారు కేసీఆర్. కానీ మూాడో తేదీన మాత్రం త్వరగా ముగించి తెలంగాణ భవన్‌కు వెళ్లనున్నారు. ఇంత అర్జెంట్‌గా టీఆర్ఎస్ఎల్పీ భేటీ ఎందుకు అన్న చర్చ టీఆర్ఎస్ పార్టీలో జరుగుతోంది. పెద్ద సంచలనాలేమీ ఉండవని.. సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారని .. వాటిపై చర్చిస్తారని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
అయితే ఒకే రోజు ఎందుకని.. తర్వాత రోజుల్లో చెప్పవచ్చు కదా అని టీఆర్ఎస్ నేతలు చర్చించుకుటున్నారు. కేసీఆర్ ఏం చేసినా బయటకు తెలియకుండా చేస్తారని.. ఈ సారి అలాంటి నిర్ణయాలు కూడా ఏమైనా తీసుకుంటారా అన్న చర్చ కూడా వినిపిస్తోంది. ఎలాంటి సంచలనాలు ఉండవని.. రొటీన్ సమావేశాలేనని టీఆర్ఎస్ వర్గాలు కవర్ చేస్తున్నాయి.