ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్‌గా కాంగ్రెస్ నేత ఎ.చక్రపాణి స్థానంలోకి రావడానికి పోటీపడుతున్న తెలుగుదేశం నాయకుల పేర్లు తెలుగు360 ఇచ్చింది. వాస్తవానికి ఈ ఎంపికకు అంతకన్నా మించిన ప్రాధాన్యత వుంది. కౌన్సిల్ చైర్మన్‌గా ఎవరిని నియమిస్తారనేది నిర్ణయమైతే రేపు క్యాబినెట్ మార్పులు చేర్పులు మొదలైపోయినట్టే. సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమ నాయుడు,సతీష్ రెడ్డి వంటి వారి పేర్లు పరిశీలనలో వున్నాయి. ఇందులో సతీష్ రెడ్డి కొత్తవాడనే అభ్యంతరం వుంది. ఇక సోమిరెడ్డి,కేశవ్‌లు మంత్రులు కావాలని చూస్తున్నారు. కేశవ్ అయితే చైర్మన్ స్థానం వద్దని చెప్పినట్టు సమాచారం. ఆ స్తానంలోకి తీసుకునేవారి పేరు నిర్ణయమైతే సామాజిక సమీకరణాలు మారతాయి. మంత్రివర్గంలోనుంచి కొందరినైనా తప్పించడం అనివార్యం. అనేక వివాదాలు ఆరోపణల్లో వున్న రావెల కిశోర్‌బాబు పేరు తొలగింపుల జాబితాలో ముందుగా వుంది. పల్లె రఘునాథరెడ్డి/బొజ్జలగోపాల కృష్ణారెడ్డి ఎవరో ఒకరు వుండబోరని చెబుతున్నారు. దానివల్ల నష్టం కలగకుండా కొత్త నియామకాలుండాలి. ఇదంతా పెద్ద కసరత్తు.రావెల బదులు డొక్కా మాణిక్య వరప్రసాద్ పేరు చెబుతున్నారు గాని ఆయనకు ఇప్పటికే ఒక పదవి ఇచ్చారు. ఆ స్థానంలోమరెవరినైనా తీసుకుని డొక్కాను మంత్రిని చేస్తారని ఆయన అనుయాయులు అంటున్నారు. నారా లోకేశ్ ఎలాగూ రాబోతున్నారు. అఖిల ప్రియను కూడా తీసుకుంటారు. వైసీపీ నుంచి వచ్చి చేరిన మరో నలుగురి పేర్లు కూడా రౌండ్లు కొడుతున్నాయి గాని ఫిరాయింపుదార్ల చేర్పుపై గవర్నర్ అభ్యంతరం చెబితే ఎలా అని తర్కిస్తున్నారట. తెలంగాణలో లేని అభ్యంతరం ఇక్కడ ఎలా చెబుతారని మరికొందరు ఆక్షేపిస్తున్నారు. గవర్నర్‌కు అంతటి అధికారం లేదని కూడా వివరణ ఇస్తున్నారు. ఏది ఏమైనా 2014 జూన్ 8న 20 మందితో ఏర్పడి ఇప్పటివరకూ యథాతథంగా కొనసాగుతున్న చంద్రబాబు మంత్రివర్గం పెద్ద మార్పులే చూడబోతుంది.ఇదేగాక మంత్రివర్గంలోవున్న లేని సూపర్ సీనియర్లకు సంబంధించి కూడా ఆసక్తికరమైన కబుర్లు వినిపిస్తున్నాయి.అవి మరోసారి….