ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అసెంబ్లీ నిర్వహించుకునే అవకాశం లేకుండా పోయింది. బడ్జెట్ సమావేశాలు పెట్టి.. బడ్జెట్ ఆమోదించుకుంటేనే… నిధుల విడుదల అవుతాయి. లేకపోతే.. మొత్తం వ్యవస్థ ఆగిపోతుంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి… ఎలాగోలా … గండం గట్టెక్కాలి కాబట్టి… అన్ని మార్గాలనూ అన్వేషించి.. చివరికి ఆర్డినెన్స్‌తో గట్టెక్కాలని నిర్ణయించుకుంది. మార్చి 31వ తేదీలోపు అసెంబ్లీలో కనీసం.. బడ్జెట్ ప్రవేశ పెట్టి.. మూడు నెలల ఓటాన్ అకౌంట్‌కు ఆమోదం పొందాలని.. ఆ తర్వాత తీరిక చేసుకుని బడ్జెట్‌ను ఆమోదింప చేసుకోవాలని అనుకున్నారు. కానీ అసలు అసెంబ్లీ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో… మూడు నెలల పద్దుల కోసం..నిధుల మంజూరు చేస్తూ.. కేబినెట్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేయించి.. గవర్నర్‌తో ఆమోదింప చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇందు కోసం శుక్రవారం… మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడూ నిర్వహించే ప్లేస్‌లో కాకుండా.. సోషల్ డిస్టెన్స్ పాటించేలా.. ఒక్కొక్క మంత్రి మధ్య మూడు మీటర్లు దూరం ఉండేలా చేసుకునేందుకు వేరే హాల్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ప్రధాన అజెండా.. బడ్జెట్ ఆర్డినెన్సే. ఏ రాష్ట్రమైనా.. కేంద్రమైనా.. బడ్జెట్ సమావేశాలను.. ఫిబ్రవరిలో .. లేదా మార్చి మొదటి వారంలో పూర్తి చేస్తాయి. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇప్పటి వరకూ బడ్జెట్ పెట్టకుండా ఆపలేదు. ఏపీ ప్రభుత్వం కూడా.. మార్చి మొదటి వారంలోనే బడ్జెట్ పెట్టాలని అనుకుంది.
తర్వాత వ్యూహం మార్చుకుంది బడ్జెట్ సమావేశాల కన్నా… స్థానిక ఎన్నికలకు ప్రాధాన్యం ఇచ్చింది. స్థానిక ఎన్నికల షెడ్యూల్ 29వ తేదీ వరకూ పెట్టుకుని… 27 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే సమస్య రాదనుకుంది. ఆ మేరకు తేదీలు ఖరారు చేసింది. కానీ కరోనా వచ్చి మొత్తం.. ప్లాన్ ను రివర్స్ చేసింది. ఇప్పుడు.. స్థానిక ఎన్నికలు లేవు.. అసెంబ్లీ సమావేశాలు లేవు.. బడ్జెట్ కూడా.. లేదు. చివరికి మంత్రివర్గ సమావేశమే… అతి కష్టం మీద జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.