జగన్ మోహన్ రెడ్డి మానసిక స్థితి గురించి ఆ పార్టీ నేతలు రకరకాలుగా చెప్పుకుంటారు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకోవడానికి ఏ మాత్రం సంకోచించని ఆయన అధికారం ఉన్నప్పుడు.. లేనప్పుడు.. తనతో అవసరం ఉన్న వారితో.. లేనివారితో ప్రవర్తించే విధానం చూసి ఖచ్చితంగా ఏదో తేడా ఉందని అనుకుంటూ ఉంటారు. అయితే గతంలో ఇదంతా నాలుగు గోడల మధ్యనే ఉండేది. జగన్ ఇప్పుడు మొత్తం బహిరంగంగా చూపించుకుటున్నారు.
కాకినాడలో ఆయన చూపించిన హావభావాలు.. ఖచ్చితంగా ఓడిపోయామన్న ఫ్రస్ట్రేషన్ కాదని.. అంతకు మించి మానసిక స్థితిలో వచ్చిన మార్పు అని పార్టీ నేతలనుకుంటున్నారు. ఆయన పిచ్చి చేష్టలతో ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత మొహంలో కూడా బలవంతంగా అయినా నవ్వుదామన్నా నవ్వు రాలేదు కానీ.. ఆయన పక్కన ఉండటాన్నే అనీజిగా ఫీలయ్యారు. వంగా గీత ఎన్ని సార్లు ఇదేం ఖర్మ అనుకున్నారో లేక్కే లేదు. టీడీపీ, చంద్రబాబుపై ద్వేషంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి. చివరికి ఎప్పుడో యాభై ఏళ్ల కిందట చంద్రబాబును ఎవరో కొట్టారని పిల్ల కబుర్లు చెప్పి ఆనందపడే… తత్వం బయటపడుతుంది.
జగన్ ప్రవర్తనను సైకాలజీపై అవగాహన ఉన్న ఎవరు విశ్లేషించినా… ఆయన ఎంత ప్రమాదకర మానసిక స్థితిలో ఉన్నారో సులువుగా చెప్పలగరు. ఆయన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రత్యర్థుల్ని శత్రువులుగా ఊహించుకుని ఏదో చేసేయాలని అనుకుంటున్నారు. తనకు అనుకూలంగా జరగకపోతే తనపై జరుగుతున్న కుట్రే అనుకుంటున్నారు. ఇది రాను రాను మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని సైకాలజీ చెబుతోందని అంటున్నారు. మరి దీనికి చికిత్స ఉండదా అంటే ఉంటుంది..కానీ చేయించుకోవాల్సిన వారు దీన్ని గుర్తించాలి కదా అన్నది మొదటి పాయింట్.