కెఫే కాఫీడే ఓనర్ సిద్ధార్థ.. అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్త. ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతదేహాన్ని సుదీర్ఘ సెర్చ్ ఆపరేషన్ తర్వాత నేత్రావతి నదిలో కనుగొన్నారు. ఆయన అదృశ్యం అయినప్పటి నుంచే .. సిద్ధార్థ విజయవంతమైన వ్యాపారవేత్త కాదని.. ఆయనది ఫెయిల్యూర్ స్టోరీ అని..ప్రచారం చేస్తున్నారు. కానీ దాని వెనుక ఉన్నది… ఆదాయపు పన్ను శాఖ అనే ఆరోపణలు వెల్లడవుతున్నాయి. దానికి సంబంధించిన ఒక్కో అంశం బయటకు వస్తోంది.
అప్పులు తీర్చుకోకుండా ఐటీ అడ్డుకుందా..?
కేఫ్ కాఫీ డేకి వేల కోట్లు అప్పులు ఉన్నాయి. వాటిని తీర్చడానికి వీజే సిద్ధార్థ.. మైండ్ ట్రీ అనే కంపెనీలో తనకు ఉన్న షేర్లను.. రూ. మూడు వేల కోట్లకు అమ్మేసుకున్నారు. అయితే ఈ ఒప్పందాన్ని ముందుకు సాగనీయకుండా.. ఐటీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. డీల్‌కు ముందు ఇన్కమ్ ట్యాక్స్ శాఖ దాడులు చేసి… మైండ్ ట్రీ షేర్లను సీజ్ చేశారు. ఆదాయ పన్ను చెల్లిస్తానని చెప్పినప్పటికీ సీజ్ చేశారని.. ఎన్నో ఆస్తులు ఉన్నా… డీల్‌కు ముందు మైండ్ ట్రీ షేర్లనే సీజ్ చేయడంతో ఆయన ఆర్థిక ఇబ్బందులు రెట్టింపయ్యాయి. కనీసం నోటీసు ఇవ్వకుండా ఐటీ శాఖ అధికారులు మూడు వేల కోట్ల విలువైన మైండ్ ట్రీ షేర్లను సీజ్ చేశారు. కేవలం రూ. 625 కోట్ల ట్యాక్స్ కోసం మూడు వేల కోట్ల షేర్లను సీజ్ చేయడం వ్యాపారవర్గాలను కూడా షాక్‌కు గురి చేసింది.
డీల్స్‌ను అడ్డుకునేందుకే షేర్లను సీజ్ చేశారా..?
పన్నులు కట్టిన తర్వాత మైండ్ ట్రీ షేర్లను విడుదల చేసిన ఐటీ అధికారులు ఆ వెంటనే కేఫ్ కాఫీ డే షేర్లను సీజ్ చేశారు. కేఫ్ కాఫీ డే చైన్‌ను కోకకోలాకు అమ్ముకునేందుకు సిద్ధమైన సమయంలోనే ఈ కంపెనీ షేర్లను సీజ్ చేసినట్లు భావిస్తున్నారు. సిద్ధార్థ సన్నిహితులు. ఓ వైపు అప్పుల భారం, మరోవైపు ప్రైవేట్ ఈక్విటీల నుంచి ఒత్తిడి కారణంగా సూచిస్తోంది సిద్ధార్థ రాసిన లేఖ. ఐటీ శాఖ అధికారులు మాత్రం అది ఎవరు రాశారన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అంతేకాదు.. తాము నిబంధనలకు అనుగుణంగా వెళ్లినట్లు చెబుతున్నారు. మొత్తంగా సిద్ధార్థ వ్యవహారం.. ఇప్పడు బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి వీజే సిద్ధార్థ వ్యవహారంలో.. బయటకు తెలియాల్సింది చాలా ఉందని.. చెబుతున్నారు.
ఐటీ కేంద్రంగా వస్తున్న ఆరోపణలకు సమాధానాలేంటి..?
వీజే సిద్ధార్థపై ఒత్తిడి తెస్తున్న ప్రైవేటు ఈక్వీటీ ఉన్న వారితో… ఐటీ అధికారులు కమ్మక్కయి.. సిద్ధార్థను.. ఇలా ఆర్థికఇబ్బందుల్లో పడేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంస్థలో వాటలను ఇతరులకు అమ్మకుండా… తామే కైవసం చేసుకునే కుట్ర చేశారన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఏం జరిగినా.. ఇదంతా.. ఐటీ శాఖ వల్లే జరగిందనే అభిప్రాయం బలపడటంతో.. నేటి సిద్ధార్థ.. అలా బలైపోయాడా.. అనే సానుభూతి అంతటా కనిపిస్తోంది.