ఈ ఏడాది రూ. పదివేల ఆదాయం వస్తే.. వచ్చే ఏడాది రూ. పదకొండు వేల ఆదాయం రావాలి. అలా కాకుండా.. రూ. పదివేల ఆదాయం వస్తే..ఆదాయం తగ్గినట్లే. అలా కాదు.. ఎనిమిది వేలు వస్తే.. ఆర్థిక పరిస్థితి చితికిపోయినట్లే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇదేనని.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్.. తేల్చేసింది. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఏపీ ప్రభుత్వ ఆదాయం.. ఏకంగా.. రూ. పది వేల కోట్లకుపైగా ఆదాయం తగ్గిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో ఏపీ సర్కార్ ఆదాయం.. 98790 కోట్లు. గత ఏడాది ఎనిమిది నెలల కాలానికి వచ్చిన ఆదాయం రూ. 1,08, 700 కోట్లు. అంటే రూ. పదివేల కోట్ల లాస్. నిజానికి ఆదాయం… ఓ పదివేల కోట్లు పెరగితే అభివృద్ది ఉన్నట్లే. లేకపోతే.. తిరోగమనేనని అర్థం.
ఏపీ సర్కార్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా.. ఏపీ ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. ఇసుక కొరతతో మొదట ఆరు నెలలు.. ఆర్థిక వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది. ఆ తర్వాత అమరావతి గొడవ రావడంతో.. నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆర్థిక వ్యవస్థకు.. ఇరుసులాంటిదే.. నిర్మాణ రంగం. అది మాత్రమే కాదు.. ప్రభుత్వం తరపున.. ఖర్చు కూడా నిలిచిపోయింది. ప్రభుత్వం ఉత్పాదక వ్యయం చేయడం మానేసింది. అంటే ప్రాజెక్టులు.. అభివృద్ధి పనులపై ఖర్చు లేదు. అనుత్పాదక వ్యయంగా భావించే సంక్షేమ పథకాలపై మాత్రమే దృష్టి పెట్టింది. దీంతో.. ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహం తగ్గిపోయింది.
ఆర్థిక లోటు.. ఎంత ఎక్కువైతే.. ఆర్థిక వ్యవస్థ అంత దిగజారిపోయినట్లు. బడ్జెట్ అంచనాల్లో.. ఈ లోటును 1770 కోట్లుగానే చూపారు. కానీ.. ఈ ఒక్క ఏడాది అది రూ. ఇరవై ఐదు వేల కోట్లకు చేరిపోయింది. ఇది అసహజమైన విషయం. గతంలో నీతి ఆయోగ్ చైర్మన్ ప్రత్యేకంగా అమరావతి వచ్చి.. ఆర్థిక పరిస్థితిపై హెచ్చరికలు జారీ చేసి వెళ్లారు. అయినా ప్రభుత్వ తీరులో మార్పు రాలేదు. తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లింపులు కూడా.. చేయలేకపోతూండటంతో.. ఆర్బీఐ ఇచ్చిన గ్యారంటీల నుంచి రుణాలు ఇచ్చిన వారు మినహాయించుకునే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే.. ఇక ఉద్యోగులకు కూడా జీతాలు అందవు. కాగ్ సహా.. ఎంత మంది హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వం తీరులో మాత్రం మార్పు రావడం లేదు.