టీడీపీ హయాంలో టీటీడీలో నిధులు దుర్వినియోగం జరిగాయని కాగ్‌తో విచారణ చేయించాలని… ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఏటా స్టేట్ ఆడిట్ ద్వారా జరిగే టీటీడీ ఆడిట్ ఇకపై కాగ్ ద్వారా జరిపేందుకు టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాలకమండలి ఏపీ ప్రభుత్వానికి సిపార్స్ చేసింది. 2014-19 మధ్య టీటీడీ నిధుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని దీనిపై కాగ్ ద్వారా ఆడిట్ జరపాలని ఇప్పటికే ఎంపీ సుబ్రమణ్యస్వామి, సత్యపాల్ సభర్వాల్ వంటి వారు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కారణంగా 2014-20 వరకు ఇప్పటికే స్టేట్ ఆడిట్ డిపార్టుమెంట్ ఆడిట్ నిర్వహించినప్పటికీ దీనిపై కూడా కాగ్ ద్వారా ఆడిట్ నిర్వహించాలని పాలకమండలి ప్రభుత్వాన్ని కోరింది. ఏటా స్టేట్ ఆడిట్ ద్వారా సక్రమంగా ఆడిట్ జరుగుతున్నప్పటికీ అనవసర ఆరోపణల వల్స భక్తుల్లో విశ్వాసం కల్పించేందుకు గాను కాగ్ ద్వారా ఆడిట్ జరపాలని పాలకమండలి సభ్యులు నిర్ణయించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత..టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ..నిధుల దుర్వినియోగం చేశారని..విచారణ చేయిస్తామని చాలా సార్లు ప్రకటనలు చేశారు.
కానీ ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిధుల దుర్వినియోగం అంటూ జరిగితే.. ఆడిట్లో తేలిపోతుంది. కొత్తగా కాగ్ కూడా.. ఆ లెక్కలనే అడిట్ చేస్తుంది. ఒక్క టీడీపీ హయానికే కాకుండా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాగ్ ఆడిట్ చేయిస్తే..టీటీడీపై విమర్శలు రాకుండా ఉంటాయి.