కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒకటి సంచలనంగా మారింది. పాతిక వేల మంది ఉద్యోగాలను తీసి పడేయడంతో వారు తీసుకున్న జీతాలను కూడా వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. 2016లో బెంగాల్ ప్రభుత్వం టీచర్ల నియామకాలు చేసింది. అందులో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరపిన హైకోర్టు ఇప్పుడు ఆ ఉద్యోగాలను రద్దు చేసింది. అంతే కాదు.. మొత్తంగా పాతిక వేల మందికిపైగా ఉద్యోగులు వారు తీసుకున్న జీతాలను 12వ శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని కూడా ఆదేశించింది. ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఈ టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన నియమాక ప్రాసెస్‌పై దర్యాప్తు చేపట్టాలని, 3 నెలల్లో రిపోర్టును సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. 25వేలకుపైగా ఉద్యోగాలను తొలగించినప్పటికీ.. మళ్లీ రిక్రూట్మెంట్ నిర్వహించాలని, సంబంధిత ప్రక్రియను త్వరగా మొదలుపెట్టాలని పశ్చిమ్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది కోల్‌కతా హైకోర్టు. మాజీ మంత్రి పార్థ ఛటర్జీ సహా అనేక మంది టీఎంసీ నేతలు, ప్రభుత్వ అధికారులు.. ఇదే కేసులో జైలులో ఉన్నారు.
ఈ స్కామ్‌కు సంబంధించి 2016లో ఏర్పాటు చేసిన బోర్డును గతేడాది తొలగించింది హైకోర్టు. అంతేకాదు.. 32వేలకుపైగా ప్రైమరీ టీచ ను కూడా తొలగించింది. ఈ తీర్పును ఇచ్చిన జడ్జీ అభిజిత్ గంగూలీకి టీఎంసీకి మధ్య మినీ యుద్ధమే జరిగింది. కొన్ని వారాల క్రితమే.. తన జడ్జి పదవికి రాజీనామా చేసిన అభిజిత్ గంగూలీ.. బీజేపీ టికెట్‌పై 2024 లక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగారు.
బీజేపీ నేత , మాజీ తృణమూల్ నేత సువేందు అధికారి కొద్ది రోజులుగా ఈ కేసుపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇలాంటి తీర్పు వస్తుందని ఆయన పరోక్షంగా చెబుతున్నారు . ఆయన నమ్మకం ఏమిటో కానీ.,. ఈ టీచర్ల రిక్రూట్ మెంట్ జరిగినప్పుడు ఆయన తృణమూల్ కాంగ్రెస్ లోనే ఉన్నారు. రవాణా మంత్రిగా ఉన్నారు.
ఇప్పుడీ తీర్పు సంచలనంగా మారే అవకాశంఉంది. ఇటీవల ఏపీ హైకోర్టు కూడా గ్రూప్ టు ఉద్యోగాల భర్తీ అవకతవకలు జరిగినట్లుగా గుర్తించి రద్దు చేసింది. కానీ మరో బెంచ్ స్టే ఇచ్చింది.